Home Remedies For Cracked Heels: శీతాకాలంలో చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమందిలో కాళ్లతో పాటు మడమల మీద వాతావరణ ప్రభావం పడి పోడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే చలి కాలంలో చాలా మందిలో మడమల్లో పగుళ్లు ఏర్పడడం వంటి సమస్యల బారిన పడతారు. అయితే దీని కారణంగా చాలా మందిలో నొప్పితో పాటు వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే మడమలపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలికాలంలో మడమలు పొడిబారి పగలడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా కొంతమంది తీవ్ర నొప్పుల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే క్రీమ్‌ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వీటిని వినియోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు హోం మేడ్ క్రీమ్‌ను వినియోగించడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి ఖర్చులు లేకుండా సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


హోం మేడ్ క్రీమ్‌ హీల్‌ క్రాక్‌ క్రీమ్‌ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
ఆవాల నూనె 2 స్పూన్లు
కొబ్బరి నూనె 2 స్పూన్లు
వాసెలిన్
చెంచావిటమిన్ ఇ క్యాప్సూల్స్
అర టీస్పూన్ కర్పూరం


తయారీ పద్ధతి:
ఒక గిన్నెలో రెండు చెంచాల కొబ్బరి నూనె, ఆవాల నూనె కలపండి. అందులోనే కర్పూరాన్ని మెత్తగా పొడి చేసి మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే మిశ్రమంలో వాసెలిన్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ కూడా కలిపి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్ని పదార్థాలను బాగా కలపి..గిన్నెను వేడి నీటిపై పెట్టి బాగా కరిగించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో నింపుకొని రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లబడ్డ తర్వాత వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి