Home Remedies For Tonsils: టాన్సిల్స్‌తో బాధపడుతున్నారా? కేవలం 1 రోజులో ఎలాంటి ఖర్చు లేకుండా చెక్ పెట్టండి!
Home Remedies For Tonsils: శీతాకాలం కారణంగా చాలా మంది కుతికల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యల కారణంగా కొంతమందిలో వాపు సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ ఇంటి చిట్కాలు పాటించండి.
Home Remedies For Tonsils: చలి కాలంలో టాన్సిల్స్(కుతికలు) ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తాయి. వీటి వల్ల గొంతులో వాపుతో పాటు నొప్పులు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఏదైనా తినే క్రమంలో ఇబ్బంది వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి సమస్యలు చలి కాలంలో సర్వసాధరణంగా వస్తూ ఉంటాయి. ఈ టాన్సిల్స్(కుతికలు) కూడా సీజన్‌ల్ వ్యాధులేనని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే వివిధ రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల ఎలాంటి ఉపశమనం పొందలేకపోతున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు కూడా సులభంగా ఈ టాన్సిల్స్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
తేనె, పసుపు పాలు:
తేనె, పసుపు కలిపి పాలను తాగడం వల్ల గొంతు నొప్పి నుంచే కాకుండా టాన్సిల్స్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. తేనె, పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని కారణంగా సులభంగా టాన్సిల్స్ నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
లవంగాలు:
లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ఇందులో ఉండే గుణాలు గొంతు నొప్పిని తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. దీంతో పాటు టాన్సిల్స్ పరిమాణాలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ లవంగాలను నమలడం వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసన నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది.
తులసి ఆకులు:
తులసి ఆకుల్లో బోలెడు ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి గొంతు నొప్పితో పాటు టాన్సిల్స్ నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి తులసి ఆకులతో తయారు చేసిన కషాయాన్ని ప్రతి రోజు గోరువెచ్చగా రెండు సార్లు తాగాల్సి ఉంటుంది.
ఉప్పు నీటితో పుక్కిలించాలి:
టాన్సిల్స్ సమస్యలతో బాధపడేవారు ఉప్పు నీటిని పుక్కిలించడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు వాటి నుంచి వచ్చే నొప్పి ప్రభావం కూడా సులభంగా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సులభంగా వాపు నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook