Honey Health Benefits: అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిన పరిస్థితి. ప్రతి ఒక్కరూ బరువు తగ్గించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. ఈ క్రమంలో స్థూలకాయం తగ్గేందుకు అద్బుతమైన చిట్కా గురించి మీకు వివరిస్తాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా స్థూలకాయం పెను సమస్యగా మారుతోంది. ఒకవేళ మీరు కూడా అధిక బరువు తగ్గించుకోవాలనుకుంటే..కొన్ని సులభమైన చిట్కాలు పాటించాలి. రోజూ ఉదయం లేచిన వెంటనే..ఓ వస్తువు సేవిస్తే పొట్టకు ఆనుకుని ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది. 


స్థూలకాయం ఒక్కటే ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా బాధిస్తున్న సమస్య. బరువు తగ్గించుకునేందుకు మీ రెగ్యులర్ డైట్‌లో కొన్ని మార్పులు చేర్పులు తప్పకుండా చేయాలి. అనవసరమైన జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్‌‌కు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక స్పూన్ తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. కొవ్వు కరిగించేందుకు తేనె ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..


బరువు తగ్గించేందుకు తేనెను మీ డైట్‌లో భాగంగా చేసుకోవాలి. తేనెలో సోడియం, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, విటమిన్ సి, పొటాషియం, జింక్, కాపర్ వంటి పోషక పదార్ధాలుంటాయి. తేనె క్రమం తప్పకుండా సేవించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. ప్రతిరోజూ ఉదయం లేచి 1 గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ తేనె కలపి..రోజు పరగడుపున సేవించాలి. దీనివల్ల స్థూలకాయం సమస్య దూరమవడమే కాకుండా..ఫిట్నెస్ కూడా ఉంటుంది. 


తేనెతో కలిగే లాభాలు


తేనె సేవించడం వల్ల కళ్లకు వెలుగు వస్తుంది. దాహం పోతుంది. తేనె ప్రతిరోజూ తీసుకుంటే కఫం సమస్య తొలగిపోతుంది. తేనె సేవించడం వల్ల దగ్గు, ఆస్తమా, అజీర్ణం, వాంతులు వంటి సమస్యలు దూరమౌతాయి.కొంతమంది వేడి నీటితో తేనె సేవిస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. 


Also read: Heart Attacks: ఇండియా మరో పదేళ్లలో గుండెపోటు వ్యాధులకు కేంద్రం కానుందా..ఏం జరుగుతోంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook