Plastic: ప్లాస్టిక్ మనిషి జీవితంలో భాగమై పోయింది. ఎన్ని  చట్టాలు తీసుకొచ్చినా ప్లాస్టిక్ వాడకం మాత్రం ఆగట్లేదు. మనం ప్లాస్టిక్(Plastic) వాడకపోయినా అది ఏదో విధంగా మన శరీరంలో ప్రవేశిస్తుంది. ప్రతి రోజు, ప్రతివారం, ప్రతి నెల మీరు ఎంత ప్లాస్టిక్ తింటున్నారో తెలిస్తే షాక్ అవుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి వ్యక్తి ఆహారం(Food)తో పాటు ప్లాస్టిక్ తింటున్నాడని చెబితే విచిత్రంగా అనిపించొచ్చు, కానీ ఇది నిజం. DW నివేదిక ప్రకారం.. ప్లాస్టిక్(Plastic) అనేది గాలి, నీరు, ఆహారంలో కరిగి ఉంటుంది. ప్రతి వారం మీరు ఐదు గ్రాముల మైక్రోప్లాస్టిక్ తింటున్నారు. అంటే క్రెడిట్ కార్డుకు సమానమైన ప్లాస్టిక్ అని అర్థం. రాయిటర్స్(Reuters) ప్రకారం.. ఫైర్‌మెన్‌ హెల్మెట్ తయారీకి ఎంత ప్లాస్టిక్ అవసరమో అంత ప్లాస్టిక్‌ మీరు సంవత్సరంలో తింటున్నారు. అంటే మనం ప్రతి 10 సంవత్సరాలకు 2.5 కిలోల కంటే ఎక్కువ ప్లాస్టిక్‌ని తింటున్నాం. అటువంటి పరిస్థితిలో మీ జీవితమంతా మీరు ఎంత ప్లాస్టిక్ తింటారో ఊహించవచ్చు. ఈ నివేదిక ప్రకారం ఒక జీవితమంతా మనం 20 కిలోల వరకు ప్లాస్టిక్ తింటామని అంచనా.


Also Read: Virgin boy egg: మూత్రంలో ఉడికించిన గుడ్లతో వంటకం..తింటే వదలరు...ఎక్కడో తెలుసా?


శరీరంలోకి ఎలా వెళుతుందంటే..
డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రకారం.. ప్లాస్టిక్ తాగునీటి నుంచి ఆహార పదార్థాల వరకు అన్నిటి ద్వారా శరీరంలోకి వెళుతుందని నివేదించింది. గాలిలో కూడా ప్లాస్టిక్ కరిగి ఉంటుందని తెలిపింది. ఇది మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపడమే కాకుండా...జీర్ణవ్యవస్థని దెబ్బతీస్తుంది. 


మనిషి చెత్తను వ్యాప్తి చేస్తున్నాడు
ప్రపంచంలోని ప్యాకేజింగ్‌(Packaging‌)లలో మూడింట ఒక వంతు ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. జర్మనీలో ప్రతి వ్యక్తి 38 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాడు. అదే సమయంలో ఐరోపాలో ప్రతి వ్యక్తి 24 కిలోల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాడు. మీరు ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారో అంతే మొత్తంలో ప్లాస్టిక్ వాడకం కూడా పెంచుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు శతాబ్దాలుగా కరగడం లేదు. అందువల్ల ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ప్లాస్టిక్ బాటిల్(Plastic bottle) పూర్తిగా ధ్వంసం కావడానికి 100 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుందని అనేక నివేదికలలో వెల్లడైంది. ప్లాస్టిక్ కవర్లు నాశనం కావడానికి 500 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ప్లాస్టిక్ పర్యావరణానికి, మీ ఆరోగ్యానికి చాలా హానికరం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook