మెరుగైన ఆరోగ్యానికి విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు ఇతర పోషక పదార్ధాలు చాలా అవసరం. అయితే ఏదైనా సరే అతిగా తీసుకోకూడదు. అతిగా తీసుకుంటే మొదటికే ప్రమాదమొస్తుంది. అనారోగ్యం వెంటాడుతుంది. ఇందులో కీలకమైంది ప్రోటీన్లు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రోటీన్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. శరీరానికి తగిన మోతాదులో ప్రోటీన్లు లేకపోతే చాలా సమస్యలు ఎదురౌతాయి. బరువు తగ్గేందుకు సైతం హై ప్రోటీన్లు ఉండే పదార్ధాలు తీసుకోమనే చెబుతారు డైటిషియన్లు. అదే సమయంలో చాలామంది బరువు తగ్గించుకునే క్రమంలో పెద్దమొత్తంలో ప్రోటీన్లు సేవిస్తుంటారు. కానీ అవసరానికి మించి ప్రోటీన్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. శరీరంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటే కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం..


హై ప్రోటీన్ డైట్


ఇటీవల ఫిట్‌నెస్ క్రేజ్ చాలా ఎక్కువగా ఉంది. సరైన పర్సనాలిటీ కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది జిమ్ , మరి కొంతమంది డైట్ ద్వారా ప్రయత్నిస్తుంటారు. ఫిజిక్ కోసం హై ప్రోటీన్ డైట్ తీసుకుంటారు. ప్రోటీన్లు కచ్చితంగా ఆరోగ్యానికి మంచిది. ప్రోటీన్లు బరువు తగ్గేందుకు దోహదపడతాయి.


ప్రోటీన్లు ఎంత తీసుకోవాలి


ప్రముఖ డైటిషియన్ల ప్రకారం సాధారణంగా బరువుకు తగ్గట్టు ప్రోటీన్లు తీసుకోవాలి. అంటే మీ బరువు 50 కిలోలుంటే..24 గంటల వ్యవధిలో 50 గ్రాముల ప్రోటీన్లు అవసరమౌతాయి. బరువుని నియంత్రించేందుకు హై ప్రోటీన్ డేట్‌ను అధికంగా తీసుకుంటుంటారు.


ప్రోటీన్లు బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. కానీ ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని గుర్తుంచుకోండి. ప్రోటీన్లతో శరీరంలోని చాలా భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. అందుకే అవసరానికి మించి ప్రోటీన్లు తీసుకోకూడదు.


జీర్ణక్రియలో ఇబ్బంది


ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో సమస్య ఏర్పడుతుంది. హై ప్రోటీన్ డైట్ కారణంగా చాలామందికి మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. ప్రోటీన్లు ఆహారంతో జీర్ణక్రియలో ఇబ్బంది కలుగుతుంది.


హై ప్రోటీన్ డైట్ అనేది కిడ్నిని దెబ్బతీస్తుంది. హై ప్రోటీన్ డైట్ కారణంగా కిడ్నీలో నైట్రోజన్ పేరుకుంటుంది. కిడ్నీలో నైట్రోజన్ తొలగించేందుకు కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటే..ఎముకలు బలహీనమౌతాయి. హై ప్రోటీన్ డైట్ కారణంగా ఆస్టియోపొరోసిస్ వ్యాధి ఎదురుకావచ్చు. 


Also read: Weight Loss Diet: రోజూ తినే గోధుమ రొట్టెలకు బదులు ఇది చేర్చండి, 3 వారాల్లో అధిక బరువుకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook