ఆధునిక జీవనశైలిలో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. స్థూలకాయం నుంచి గట్టెక్కేందుకు ఎక్సర్‌సైజ్, వాకింగ్, సైక్లింగ్, యోగా ఇలా వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వీటికి తోడు..డైట్ కూడా కొద్దిగా మార్చితే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఆ వివరాలు మీ కోసం..
స్థూలకాయం, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉండటంతో గోధుమ రొట్టెలు తీసుకోవడం పెరిగింది. అయితే మీ డైట్‌లో గోధుమల స్థానంలో జొన్నలు చేరిస్తే అద్భుతమైన ఫలితాలుంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా జొన్న రొట్టెలతో బరువు వేగంగా తగ్గవచ్చని తెలుస్తోంది. జొన్న రొట్టెలు డైట్‌లో చేరిస్తే..బరువు తగ్గేందుకు మరే ఇతర డైట్ ప్లాన్ అవసరం లేదు.
ప్రముఖ డైటిషియన్ల ప్రకారం జొన్నల్లో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. జొన్నల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతోపాటు కడుపుకు సంబంధించిన సమస్యల్ని దూరం చేస్తుంది.
జొన్నల్లో మినరల్స్, ప్రోటీన్లు, విటమిన్ బి వంటి పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి దాంతోపాటు పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్ కూడా ఉంటాయి. జొన్నల్లో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలుంటాయి. అన్నింటికీ మించి ఇది గ్లూటెన్ ఫ్రీ కావడం.
జొన్నలు డైట్‌లో భాగంగా చేసుకోవడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. మరోవైపు ఇందులో ఉండే ఐరన్..ఎర్ర రక్తకణాల వృద్ధిలో దోహదపడుతుంది. రాగి శరీరంలో ఐరన్ జీర్ణానికి ఉపయోగపడుతుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండటంతో పాటు ప్రోటీన్లు కూడా జొన్నల్లో పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ ఎక్కువసేపు కడుపు నిండినట్టుగా ఉంచుతాయి. గుప్పెడు జొన్నల్లో 12 గ్రాముల ఫైబర్, 22 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. గోధుమలు లేదా మైదా స్థానంలో జొన్న రొట్టెలు తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండినట్టుగా ఉండి ఆకలేయదు.
జొన్నల్లో ఉండే మెగ్నీషియం..కాల్షియం జీర్ణంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎముకల పటిష్టంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. జొన్నలు మధుమేహ వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. జొన్నల్లో టెనిన్ పేరుతో ఒక పోషక పదార్ధముంది. ఇది శరీరానికి చాలా మంచిది. శరీరంలో ఇన్సులిన్, గ్లూకోజ్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది.
Also read: Turmeric: ఈ వ్యాధులు ఉన్నా వారు పసువును అతిగా తీసుకుంటే.. ఇక అంతే సంగతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook