LIC Claim Process: ఎల్ఐసీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలు ప్రవేశపెడుతూ దేశంలో అగ్రగామిగా నిలిచిన భారత ప్రభుత్వరంగ సంస్థ. దురదృష్ఠవశాత్తూ పాలసీదారుడు మరణిస్తే..ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) అంటే అందరికీ తెలిసిందే. దేశంలోని ప్రతి మధ్య తరగతి కుటుంబాల్లో ఎల్ఐసీ పాలసీ కచ్చితంగా ఉంటుంది. ప్రతి చిన్న పల్లెకూ విస్తరించిన సంస్థ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలను ప్రవేశపెడుతోంది. ఎల్ఐసీ పాలసీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పాలసీ తీసుకున్న వ్యక్తి ఒకవేళ చనిపోతే..నామినీ లేదా కుటుంబసభ్యులు సంబంధిత పాలసీను క్లెయిమ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు  తెలుసుకుందాం. డెత్ క్లెయిమ్(Death Claim)ఫైల్ చేసే ప్రక్రియను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం మంచిది. డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. పాలసీ తీసుకున్న హోమ్ బ్రాంచ్‌ను సంప్రదించాలి. ఆ శాఖకు వెళ్లేముందు అవసరమైన అన్ని పత్రాల్ని తీసుకెళ్లాలి. డెత్ క్లెయిమ్ ఫారమ్‌ను సమర్పించే ముందు పాలసీ చేసిన ఏజెంట్ లేదా డెవలప్‌మెంట్ ఆఫీసర్ సంతకం తప్పనిసరి. 


ఎల్ఐసీ క్లెయిమ్ ఎలా (How to file lic claim)


డెత్ క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ముందుగా ఎల్ఐసీ హోమ్ బ్రాంచ్‌ను సంప్రదించాలి. పాలసీదారుడి మరణం గురించి చెప్పాలి. నామినీ బ్యాంకు ఖాతాలో నిధుల బదిలీ నిమిత్తం ఫారం 3783, ఫారం 3801, ఎన్ఈఎఫ్‌టీ ఫారమ్‌లు తీసుకోవాలి. ఈ ఫారమ్‌లను ఫిల్ చేసి..ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్, ఒరిజినల్ పాలసీ బాండ్, నామినీ పాన్‌కార్డు, నామినీ ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్, మరణించిన పాలసీదారుడి ఐడీ, నామినీ డిక్లరేషన్ ఫారమ్ సమర్పించాలి. పాలసీదారుడు మరణించిన తేదీ, మరణించిన ప్రదేశం, మరణానికి కారణం గురించి చెప్పాల్సి ఉంటుంది. ఎన్ఈఎఫ్‌టీ ఫారంతో పాటు నామినీ బ్యాంకు ఖాతాదారుని పేరు, ఎక్కౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఉన్న క్యాన్సెల్ చెక్ సమర్పించాలి. బ్యాంకు పాస్‌బుక్ ఫోటో కాపీ కూడా తప్పకుండా సబ్మిట్ చేయాలి. నామినీకు సంబంధించిన పాన్‌కార్డు, పాలసీదారుడి ఐడీ ప్రూఫ్,వెరిఫికేషన్ నిమిత్తం ఒరిజినల్ బ్యాంక్ పాస్‌బుక్ వంటివి తప్పకుండా తీసుకెళ్లాలి. 


డెత్ క్లెయిమ్ ప్రోసెసింగ్ డాక్యుమెంట్లు ఆమోదించడానికి ముందు ఎల్ఐసీ ఆఫీసర్ ఒరిజినల్ పాస్‌బుక్ కాపీతో వెరిఫై ప్రక్రియ ఉంటుంది. మొత్తం నగదును నామినీ బ్యాంకు ఎక్కౌంట్‌లో బదిలీ చేసే ముందు ఎల్ఐసీ కొన్ని అదనపు డాక్యుమెంట్లను కోరే అవకాశముంది. డాక్యుమెంట్లు సమర్పించిన తరువాత ఎక్‌నాలెడ్ద్‌మెంట్ రసీదు భద్రపర్చుకోవాలి. నెల వ్యవధిలో నగదు మొత్తం బదిలీ అవుతుంది. 


Also read: Vitamins for Get Pregnant: ప్రెగ్నన్సీ ప్రోత్సహించే బెస్ట్ విటమిన్లు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి