How To Cure Sunburn Effects: స్కిన్ ట్యానింగ్ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇలా సులభంగా విముక్తి పొందండి..!
How To Cure Sunburn Effects: ఎండాకలంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే పెరుగుతాయి. ఇదే తరుణంలో చాలా మందికి ఖాళీ సమయం దోరుకుతుంది. అటువంటప్పుడు కొందరు విహార యాత్రలకు, బీచ్ హాలిడే కోసం వెళ్తూ ఉంటారు.
How To Cure Sunburn Effects: ఎండాకలంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే పెరుగుతాయి. ఇదే తరుణంలో చాలా మందికి ఖాళీ సమయం దోరుకుతుంది. అటువంటప్పుడు కొందరు విహార యాత్రలకు, బీచ్ హాలిడే కోసం వెళ్తూ ఉంటారు. దీని కారణంగా చాలా మందికీ స్కిన్ టానింగ్ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా అనేక చర్మ సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అయితే ఇంటి చిట్కాలను ఉపయోగించి వీటి నుంచి విముక్తి పొందవచ్చని పలువు నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అలోవెరా జెల్:
అలోవెరా జెల్ చర్మానికి ఔషధంల పని చేస్తుంది. ఇది అన్ని చర్మ సమస్యలను తొలగించి.. తేమను కూడా అందిస్తుంది. సన్‌బర్న్ ప్రభావాన్ని తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది.
తేనె:
తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మపు చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది. సన్ బర్న్, టానింగ్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఐస్ ముక్కలు:
ముఖం మీద బర్నింగ్, నొప్పి, వాపును కోల్డ్ కంప్రెస్ సహాయంతో నివారించవచ్చు. ఇందుకోసం ఫ్రీజర్‌లోని ఐస్ క్యూబ్స్‌ని బయటకు తీసి గుడ్డలో చుట్టి ముఖానికి, మిగిలిన చర్మానికి రుద్దండి.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది సహజసిద్ధ ట్యానింగ్‌ను తొలగిస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Remedy For Yellow Teeth: సులభంగా ఇలా పసుపు దంతాలను శుభ్రం చేసుకోండి..!
Also Read: How To Get Good Sleep: రాత్రి పూట సరిగ్గా నిద్రపోలేక పోతున్నారా.. అయితే ఇది ట్రై చేయండి..!