COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


How To Detox Your Body: ప్రస్తుం ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల వస్తున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రత్నిస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. అయితే పాటించిప్పటికీ చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం..శరీరంలోని విషపూరీతమైన పదార్థాలు అధిక పరిమాణంలో పేరుకుపోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మలినాలను తొలగించడానికి చాలా రకాల ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల శరీరం నిర్విషీకరణ అవుతుంది. అంతేకాకుండా రక్త కూడా ఫిల్టర్‌ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం నిర్విషీకరణ చేయడానికి ఎలాంటి ఆయుర్వేద చిట్కాలు పాటించాలో ఇప్పుడ మనం తెలుసుకుందాం.


అల్లం, బెల్లం టీ:
మనం సాధరణంగా పంచదార, పాలతో తయారు చేసిన టీని తాగుతూ ఉంటాం..అయితే చక్కెరకు బదులుగా టీలో బెల్లం, అల్లం రెండింటినీ మిక్స్‌ చేసి మరిగించి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.  శరీరంలోని టాక్సిన్స్‌ కూడా బయటికి వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా  జలుబు, దగ్గు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..


తులసి టీ:
తులసి టీలో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో తులసి ఆకులతో తయారు చేసిన టీ పౌడర్స్‌ విచ్చలవిడిగా లభిస్తున్నాయి. అయితే వీటిని వినియోగించడం వల్ల కూడా శరీరం నిర్విషీకరణ అవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ-వైరల్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి  టీని ప్రతి రోజు తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


కొత్తిమీర, పుదీనా టీ:
కొత్తిమీర, పుదీనా టీ ప్రతి రోజు తీసుకోవడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు శరీరాన్ని సులభంగా నిర్విషీకరణ చేస్తుంది. కొత్తిమీర, పుదీనా టీ ప్రతి రోజు తాగితే పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. 


నిమ్మరసం:
బరువు తగ్గడానికి ఉదయాన్నే నిమ్మరసం తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఆమ్ల గుణాలు రక్తాన్ని శుభ్రపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి లోపం సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


(నోట్‌ : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి