How To Find Corona Vaccination Centres Near Me: మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభమైంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ దశలో కోవిడ్-19 వ్యాక్సిన్లు తీసుకున్నారు. 60 ఏళ్లు పైబడిన అందరికీ, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న 45 నుంచి 59 ఏళ్ల వయసు వారికి సైతం రిజస్ట్రేషన్ చేసుకుంటే కరోనా టీకా ఇస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ వ్యాప్తంగా మొత్తం 10 వేలకు పైగా ప్రభుత్వ కేంద్రాలలో ఉచితం కోవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తున్నారు. కోవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న వారు టీకా తీసుకోవచ్చు. అయితే మీకు దగ్గర్లో కరోనా వ్యాక్సిన్(COVID-19 Vaccine) ఇచ్చే కేంద్రాలను తెలుసుకోవడం ఎలా ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే మై ఇండియా యాప్ ద్వారా సులువగా కరోనా టీకా కేంద్రాలను తెలుసుకోవచ్చునని ఆ సంస్థ సీఈవో రోహన్ వర్మ ఇదివరకే వెల్లడించారు.


Also Read: 7th Pay Commission Latest News: ఇన్‌కమ్ ట్యాక్స్ అదనపు ప్రయోజనాలు పొందాలనుకుంటే Govt Employeesకు శుభవార్త  


వ్యాక్సిన్ కోసం రిజస్ట్రేషన్ చేసుకునే కోవిన్ వెబ్‌సైట్(Cowin Website), మ్యాప్ మై ఇండియా యాప్‌(Map My India APP)లు సంయుక్తంగా సేవలు అందిస్తున్నాయి. మ్యాప్ మై ఇండియా యాప్‌లో దేశవ్యాప్తంగా ఉన్న కరోనా టీకా పంపిణీ కేంద్రాలతో పాటు పూర్తి వివరాలు అందులో పొందుపరిచారు. యాప్‌లో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న కేంద్రాలు, మీకు దగ్గర్లోని కేంద్రాన్ని తెలుసుకునేందుకు కింది విధంగా చేయాలి.


Also Read: Corona Vaccination: ఈ వ్యాధులు ఉన్నాయా, అయితే COVID-19 Vaccine తీసుకునేందుకు అర్హులు అవుతారు


వ్యాక్సిన్ చేయించుకోవాలనుకునేవారు మ్యాప్ మై ఇండియా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మ్యాప్ మై ఇండియా వెబ్‌సైట్‌లోనూ వివరాలు కనుక్కోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ సెర్చ్ కాలమ్‌లో మీరు ఉంటున్న ప్రాంతం పేరు, లేదా మీ అడ్రస్ టైప్ చేయాలి. ఆ తరువాత సెర్చ్ మీద క్లిక్ చేయగా మీరు పేర్కొన్న ప్రాంతం దగ్గర్లో ఉన్న కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) కేంద్రాల వివరాలు మీకు తెరమీద కనిపిస్తాయి. ఆ కరోనా కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ లాంటి వివరాలు తెలుసుకోవచ్చు, ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు టీకా అందుకుంటారు.


Also Read: Migraine: తలనొప్పే కదా అని ఈజీగా తీసుకోవద్దు, Neck Pain వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook