COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్నా.. వీరికి అంతగా పనిచేయదు!

Corona Vaccine: Obesity, Alcohol Consumption Can Lower Effectiveness Of COVID-19 Vaccines: కరోనా వైరస్ టీకాలు భారత్‌లో విజయవంతంగా కొనసాగుతున్నాయి. కోవాగ్జిన్, కోవిషీల్డ్ కరోనా టీకాలు తీసుకున్నప్పటికీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, లక్షణాలు ఉన్న వారిలో కోవిడ్ 19 టీకాలు అంతగా ప్రభావం చూపవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 20, 2021, 04:12 PM IST
  • ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోవాగ్జిన్ కోవిషీల్డ్ టీకాలు ఇస్తున్నారు
  • కొన్ని రకాల ఆరోగ్య కారణాలు ఉన్న వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్లు పనిచేయవు
  • ఉపేక్షిస్తే టీకాలు పనిచేయక ప్రాణాల మీదకి వచ్చే ఛాన్స్ ఉంది
COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్నా.. వీరికి అంతగా పనిచేయదు!

Corona Vaccine: Obesity, Alcohol Consumption Can Lower Effectiveness Of COVID-19 Vaccines: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోవాగ్జిన్ కోవిషీల్డ్ టీకాలు ఇస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు.. 50 ఏళ్లు పైబడిన వారికి తొలి దశలో కోవిడ్ -19(Covid-19 ) టీకాలు ఇస్తున్నారు. స్థూలకాయం(Obesity), కొన్న రకాల ఆరోగ్య కారణాలు ఉన్న వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్లు సామర్థ్యం మేర పనిచేయవని నివేదికలు చెబుతున్నాయి.

ఊబకాయం అనేది కరోనా వైరస్ సంక్రమణకు ఓ కారణం అవుతుందని అనేక అధ్యయనాలు గుర్తించాయి. ఆగష్టు 2020లో అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. అధిక బరువు ఉన్న వారికి COVID-19 సంక్రమించే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా యువకులు, మధ్య వయసు మగవారిలో ఇది మరింత ప్రమాదమని చెబుతున్నారు.

Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..

ఊబకాయం(Obesity) ఉన్నవారితో పాటు మద్యం సేవించే వారిలో టీకాలు తీసుకున్నప్పటికీ దాని సామర్థ్యం మేరకు వ్యాక్సిన్ పనిచేయదని పలు అధ్యయనాలు వెల్లడించాయి. వీటితో పాటు నిరాశ, ఒత్తిడి, ఒంటరితనం లాంటి అంశాలు శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయని తద్వారా కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని గుర్తించారు. 

Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త..

కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, అధిక మధుమేహం, క్యాన్సర్ వంటి రోగనిరోధక శక్తి లేని పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి కరోనా టీకాలు అంతగా పనిచేయవు. అందుకోసం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారిలో కరోనా టీకా పనిచేసే సామర్థ్యం తగ్గుతుందని న్యూఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్, మైక్రోబయాలజీ సీనియర్ కన్సల్టెంట్ జ్యోతి ముత్తా తెలిపారు.

కోవిడ్ -19 టీకా తీసుకోవడానికి ముందు, టీకా తీసుకున్న తర్వాత సైతం కొన్ని రోజులపాటు మద్యపానానికి దూరంగా ఉండాలని ముత్తా సిఫారసు చేశారు. ఏదైనా టీకా వల్ల గరిష్ట అధిక ప్రయోజనం పొందాలంటే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని, ఎక్కువ గంటలు నిద్రించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Sleeping At Afternoon: మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రించవచ్చా.. ఈ లాభాలు తెలుసుకోండి 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News