How to Gain Weight In 10 Days: సన్నగా ఉండటం వల్ల శరీర అకృతి అంతగా అందంగా ఉండదు. బరువు తగ్గడం శరీరానికి ఎంత మంచిదో.. కొందరకీ బరువు పెరగడం కూడా అంతే మంచిది. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల ఆనారోగ్య సమస్యల బారిన పడి సులభంగా బరువు తగ్గి శరీర ఆకృతిని కోల్పొతున్నారు. ఇలా కావడం వల్ల అందంగా కనిపించలేకపోతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది. అయితే ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. ఆ ఆహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆహారంతో పాటు రోజూ పాలు తీసుకోవాలి:
అరోగ్యంగా ఉండేందుకు ఆహారంతో పాటు పాలను తీసుకోవడం చాలా మందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే శరీర బరువును పెంచుకోవడానికి పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు కూడా ప్రభావవంతంగా పని చేస్తాయి. పాలలో ప్రొటీన్లు, కాల్షియం, పిండి పదార్థాలు, కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి శరీరాన్ని దృఢంగా చేయడమేకాకుండా బరువును కూడా సులభంగా పెంచేందుకు సహాయపడుతుంది. కాబట్టి బరువును సులభంగా పెంచుకోవడానికి తప్పకుండా పాలతో చేసిన ఆహార పదార్థాలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే సులభంగా బరువు పెరగాలనుకునేవారు ప్రతి రోజూ  నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి ఉదయం పూట తీసుకుంటే శరీరానికి ప్రయోజనాలు లభించడమేకాకుండా కండరాలు కూడా సులభంగా పెరుగుతాయి.


డ్రై ఫ్రూట్స్ తినండి:
సులభంగా బరువు పెరగాలనే కోరికలు ఉన్నవారు.. క్రమం తప్పకుండా డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు పెరగడంతో పాటు శరీరానికి అధిక పరిమాణంలో పోషకాలు అందుతాయి. డ్రై ఫ్రూట్స్‌లో  వివిధ రకాల యాంటీ-ఆక్సిడెంట్లు, ప్రోటీన్, కాల్షియం, మైక్రోన్యూట్రియెంట్‌లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీర బరువు పెరగడమేకాకుండా అన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.


నెయ్యి తింటే బరువు తీరగడం ఖాయం:
నెయ్యిలో శరీర బరువును పెంచే గుణాలున్నాయి. కాబట్టి బరువు పెరగాలనుకునేవారు క్రమం తప్పకుండా నెయ్యితో తయారు చేసిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని కూడా పెంచడానికి సహాయపడుతాయి.  కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా నెయ్యిని తీసుకోండి.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే


Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook