How To Get Naturally Long Hair: సాయి పల్లవి చిత్ర పరిశ్రమల్లో మంచి పేరు ఉంది. ఆమె అద్భుతమైన నటనతో ఎప్పుడూ ఫ్యాషన్, గ్లామర్ కపిస్తూ ట్రెండ్‌ అవుతూ ఉంటుంది. సాయి పల్లవి అందరిలా కాకుండా చాలా సాధారణంగా ఉంటుంది. అయితే చాలా సార్లు ఆమె అందం గురించి వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా సాయి తన పొడవాటి, మంద పాటి జుట్టు గురించి పలు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది పెద్ద పాటి జుట్టును కావాలని కోరుకుంటారు. అంతేకాకుండా మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్స్‌ను కూడా వినియోగిస్తారు. అయితే సాయి పల్లవి లాంటి జుట్టు కావాలనుకుంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా హెయిర్ మసాజ్ చేయండి:
వాతావరణ కాలుష్య కారణంగా చాలా మందిలో జుట్టు రాలే సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా చాలా చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారని ఇటివలే పలు నివేదికలు తెలిపాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా సరైన క్రమంలో మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల జుట్టు దృఢంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది.


1. తలపై పొడవాటి వెంట్రుకలు పెరగాలంటే తలకు నూనె రాసుకోకుండా మసాజ్ చేస్తే రక్తప్రసరణ పెరిగి జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.
2. తల చుట్టూ రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మసాజ్ టూల్స్ సహాయం కూడా తీసుకోవచ్చు. దీని ప్రభావం కొద్దిరోజుల్లోనే కనిపిస్తోంది.
3. జుట్టు పెరుగుదలను పెంచడానికి.. ఆలివ్ ఆయిల్, ఆముదం, కొబ్బరి నూనె వంటి హెయిర్ ఆయిల్‌తో మీ తలపై మసాజ్ చేయవచ్చు.
4. హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత, జుట్టును సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై తేలికపాటి షాంపూ సహాయంతో శుభ్రం చేయండి. ఈ సమయంలో కూడా తేలికపాటి వేళ్లతో తలపై మసాజ్ చేయండి.
5. జుట్టు కోసం ఎలాంటి హిట్టింగ్ టూల్‌ను ఉపయోగించకూడదు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?


Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe