Get Pink Lips: 5 రోజుల్లో గులాబీ రంగు పెదాలను పొందాలనుకుంటున్నారా? ఇలా చేస్తే చాలు మీ సొంతం!
How To Get Pretty Pink Lips: గులాబీ రంగు పెదాలను పొందడానికి చాలా మంది మార్కెట్లో లభించే పలు రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయితే వీటిని బదులుగా నిపుణులు సూచించి ఈ చిట్కాలు పాటించండి. సులభంగా ఉపశమనం పొందుతారు.
How To Get Pretty Pink Lips: అందమైన, గులాబీ రంగు, మృదువైన పెదాలను కోరుకుంటారు. అయితే దీని కోసం చాలా మంది రసాయానాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. వాటిని వినియోగించడం వల్ల పెదాలు గులాబీ రంగులోకి మారిన భవిష్యత్‌లో పలు రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సహజంగా ఈ పింక్ పెదాలను పొందడానికి నిపుణులు సూచించి పలు చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. వాటిని వినియోగించడం వల్ల పెదాలు మృదువు, కాంతి వంతంగా తయారవుతాయి. అయితే ఎలాంటి చిట్కాలను పాటిస్తే సులభంగా గులాబి రంగు పెదాలను పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పెదాలను అందంగా మారడానికి అద్భుత చిట్కాలు:
1. ఎక్కువ నీరు తాగాలి:
సీజన్‌లో మార్పుల కారణంగా కూడా పెదాల రంగు మారుతుంది. ముఖ్యంగా ఎండా కాలంలో శరీరంలో నీటి కోరత వల్ల కూడా సలుభంగా పెదాలు నల్లగా మారే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శరీర హైడ్రెట్‌గా ఉండడానికి అధిక పరిమాణంలో నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా సులభంగా శరీర హైడ్రేట్‌గా మారుతుంది. దీంతో చర్మ సమస్యలతో పాటు పెదాలు రంగు కూడా మారుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉశమనం లభిస్తుంది.
2. పెదాలకు ఉత్తమ మాయిశ్చరైజర్:
ముఖానికి, చర్మానికి మాయిశ్చరైజర్ ఎంత అవసరమో, పెదవులకు చేయడం అంతే అవసరమని సౌంద్య నిపుణులు తెలుపుతున్నారు. బాదం నూనె సీరమ్ లేదా కొబ్బరి నూనె సీరమ్ ఉపయోగించి మాయిశ్చరైజర్ చేయడం వల్ల సులభంగా గులాబి రంగు పెదాలను పొందొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిని చర్మానికి అప్లై చేసిన మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ దీనిని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు.
3. పెదాలకు మాస్క్‌ను అప్లై చేయండి:
ప్రస్తుతం చాలా మంది ముఖం, జుట్టును సంరక్షణ కోసం మాస్క్‌లను అప్లై చేస్తున్నారు. మంచి లిప్స్ కోసం లిప్ మాస్క్‌ను కూడా వినియోగించవచ్చని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ఒక చెంచా తేనె తీసుకుని, అందులో చుక్కల కొబ్బరి నూనెను కలపండి. అందులోనే చిటికెడు పసుపు వేయండి. వీటిని మిశ్రంలా తయారు చేసుకుని క్రమంత తప్పకుండా పెదాలకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పెదాలు పలగడం వంటి సమస్యల తగ్గుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..
Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook