Dark Neck: డార్క్ నెక్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ చిన్న చిట్కాతో చెక్!
How To Get Rid Of Dark Neck: వాతావరణంలో మార్పుల కారణంగా చాలా మందిలో చర్మ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మెడపై టానింగ్ సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
Dark Neck Home Remedies: వాతావరణ కాలుష్యం కారణంగా మెడ వెనుక భాగంలో ధూళి పేరుకుపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఎందుకంటే మెడపై చెమట, దుమ్ము, మట్టి, చర్మం ట్యానింగ్ కారణంగా నల్లగా మారుతుంది. దీంతో అది అందహీనంగా తయారవుతుంది. అంతేకాకుండా దీని ప్రభావం మెడపై కూడా పడుతోంది. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. దీని కారణంగా తీవ్ర చర్మ సమస్యలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలను పాటించడం వల్ల సులభంగా ఈ టానింగ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నిమ్మకాయ సహాయంతో మెడపై టానింగ్ పోతుంది:
నిమ్మకాయతో మెడలోని నల్లదనాన్ని సులభంగా పోగొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, విటమిన్ బి, భాస్వరం, కార్బోహైడ్రేట్స్ అన్ని రకాల చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మెడపై టానింగ్ కూడా సులభంగా పోతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు మెడను అందంగా చేయడానికి కూడా సహాయపడుతుంది.
నిమ్మకాయను ఇలా వినియోగించండి:
1. నిమ్మకాయ, దోసకాయ:
నిమ్మకాయ, దోసకాయ చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా మెడకు చల్లధనాన్ని కూడా అందజేస్తుంది. నిమ్మకాయలో బ్లీచింగ్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది మురికి శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. మెడపై టోనర్‌గా ఈ రెండు వస్తువుల మిశ్రమాన్ని కలిపి ఉపయోగించండి. సుమారు 15 నిమిషాల తర్వాత మెడను కడిగి తుడవండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే సులభంగా అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. నిమ్మకాయ, బంగాళాదుంప:
నిమ్మకాయతో పాటు, బంగాళాదుంప కూడా చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటి రసాన్ని ఒక గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు కాటన్ బాల్స్ సహాయంతో ప్రభావిత ప్రాంతాల్లో రుద్దండి. సుమారు 20 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో మెడను కడగాలి. ఇలా రోజూ వినియోగిస్తే సులభంగా అన్ని చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Building Collapses Video: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. వీడియో చూశారా..!
Also Read: Suma Adda Show: సుమక్కా.. అవి లారీ కింద నిమ్మకాయలు.. ఎంత పనిచేశావ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook