How to Get Rid of Yellow Teeth: చిరునవ్వు నవ్వగానే ముఖంలో మొదటగా అందరికీ కనిపించేవి మన దంతాలు మాత్రమే. అయితే చాలామంది దంతాల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కొందరైతే శుభ్రం చేసుకోకపోవడం వల్ల దంతాలపై పేరుకుపోయిన మురికి వల్ల తలెత్తే సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. అయితే ఈ దంతాల సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుట్కా, పాన్ మసాలా, పాన్, కాఫీ వంటి చెడు అలవాట్లను కూడా మానుకోవాల్సి ఉంటుంది. అయితే దంతాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వాటిపై ఉన్న మురికిని ఎలా శుభ్రం చేసుకోవాలో సులభమైన చిట్కాలతో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దంతాలను శుభ్రం చేయడానికి వీటిని ఉపయోగించండి:


బేకింగ్ సోడా:
బేకింగ్ సోడాను మనమంతా కేక్స్ తయారీ ఇతర ఆహార తయారీ క్రమంలో తరచుగా వినియోగిస్తుంటారు. కానీ దీనిని దంతాలు శుభ్రం చేసుకుని ఎందుకు కూడా వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల చాలా టూత్ పౌడర్లు బేకింగ్ సోడా తో తయారు చేసినవి మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయని.. దంతాలను శుభ్రం చేయడం వల్ల మురికి మొత్తం సులభంగా తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పౌడర్ లో నిమ్మరసం మిక్స్ చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు పళ్ళను తోముకుంటే త్వరలోనే మీరు ఫలితం పొందుతారు. 


కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె అనేక రకాలుగా ఉపయోగిస్తారు.  కేరళ ప్రాంతంలోనైతే.. వంటల్లో వినియోగిస్తారు. అంతేకాకుండా జుట్టు చర్మానికి కూడా భారతీయులు వాడుతుంటారు. అయితే దీనిని పళ్ళకి కూడా వినియోగిస్తే గొప్ప శుభ్రత లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికోసం మీరు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకొని నోట్లో వేసుకొని 20 నుంచి 15 నిమిషాలు దాకా పుక్కిలించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా పళ్ళ పై ఉన్న ఘాట్లు తగ్గడమే కాకుండా శుభ్రంగా తయారవుతాయి. 


3. ఆహారం తిన్న తర్వాత పుక్కిలించి ఉంచాలి:
ఎలా ఉంది బయట లభించే మసాలాతో కూడిన ఆహారాలను విచ్చలవిడిగా తింటూ ఉంటారు. వాటి మసాలా అంతా పళ్ళలో ఇరుక్కుపోయి వాటిపై పేరుకుపోతుంది. ఇలా పేరుకుపోవడం వల్ల గాట్లు ఏర్పడి పళ్ళు అంద హీనంగా తయారవుతాయి. అయితే ఇలా పళ్ళపై పేరుకు పోకుండా ఉండడానికి.. తప్పకుండా స్వీట్లు మసాలా కలిగిన ఆహారాలను తిన్న తర్వాత వేడి నీటితో పుక్కిలించి ఉంచాలి.


Also Read: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ సినిమాకు టైటిల్ మార్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'గా వస్తున్న పవర్ స్టార్  


Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook