How To Get Rid Whiteheads: ఆధునిక జీవన శైలి కారణంగా అందాన్ని రక్షించుకోవడం చాలా కష్టతరంగా మారింది. ప్రస్తుతం చాలా మందిలో వాతావరణ కాలుష్యం కారణంగా చర్మ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది చర్మంపై వైట్‌హెడ్స్‌ బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలను తగ్గించకోవడానికి మార్కెట్‌లో రసాయనాలతో కూడిన స్కిన్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌ లభిస్తున్నాయి. వీటిని వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. కాబట్టి  వైట్‌హెడ్స్‌ సమస్యలతో బాధపడుతున్నవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల సులభంగా ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందచ్చని నిపుణులు అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. జామ స్క్రబ్‌తో వైట్‌హెడ్స్‌ చెక్‌:
ఈ  వైట్‌హెడ్స్‌ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఖరీదైన ప్రోడక్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. అందరూ ఈ ప్రోడక్ట్స్‌ను కొనుగోలు చేయడం చాలా కష్టం కాబట్టి.. సౌందర్య నిపుణులు సూచించిన జామ స్క్రబ్‌ని వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్‌ను అందించి చర్మ సమస్యలను సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా వైట్‌హెడ్స్‌ సమస్యలను పూర్తిగా నయం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.


ఈ జామ స్క్రబ్ తయారు చేయడానికి ముందుగా ఒక జామపండు,  4 జామ ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని గ్రైండర్‌లో వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక కప్పులతోకి తీసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ముఖాన్ని బాగా శుభ్రం చేసుకుని ఈ జామ మిశ్రమాన్ని మూఖానికి బాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన 25 నిమిషాల పాటు అలాగే ఉంచి.. చల్లని నీటితో మూఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పుకుండా అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వేసవి కాలంలో వచ్చే చర్మ సమస్యలు సులభంగా దూరమవుతాయి. 


Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు  
2. గులాబీ  స్క్రబ్:
గులాబీ  స్క్రబ్ కూడా వైట్‌హెడ్స్‌ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మానికే కాకుండా జుట్టుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. కాబట్టి గులాబీ  స్క్రబ్‌ను చర్మానితో పాటు జుట్టుకు వినియోగించడం వల్ల జుట్టు రాలడం సమస్యలు దూరమవుతాయి. అయితే ఈ గులాబీ  స్క్రబ్ తయారు చేయడానికి నిపుణులు సూచించిన ఈ కింది పద్ధతిని వినియోగించాల్సి ఉంటుంది. 


ఈ స్క్రబ్‌ను తయారు చేయడానికి ముందుగా 10 నుంచి 15 గులాబీ పూలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక బౌల్‌ తీసుకుని గులాబీ రేకుల అందులో వేసుకోవాలి. అందులోనే రెండు చెంచాల ఓట్స్ వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత గ్రైండర్‌లో వేసి బాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సులభంగా వైట్‌హెడ్స్‌ సమస్యలు దూరమవుతాయి.


Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి