Ghee Purity: నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్లతో పుష్కలంగా ఉండే నెయ్యితో..రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. మరి మార్కెట్‌లో లభించే నెయ్యిలో..ఏది అసలు..ఏది నకిలీ ఎలా గుర్తించడమనేది సమస్యగా మారింది. అసలు, నకిలీ ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒరిజినల్ నెయ్యి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు..శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు కీలకపాత్ర పోషిస్తుంది. అందరికీ ఇంట్లో నెయ్యి తయారు చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ మార్కెట్‌లో లభించే నెయ్యిలో కల్తీ చాలా ఉంటోంది. ఏది అసలైన నెయ్యి..ఏది నకిలీ అనేది గుర్తించగలగాలి. ఎలా తెలుసుకోవడం ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్న. అది తెలుసుకోగలిగితే..ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుంది. మార్కెట్‌లో లభించే నెయ్యిలో అసలు, నకిలీ ఏదనేది ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం..


1. నీళ్ల ద్వారా నెయ్యి అసలైందా కాదా అనేది తెలుసుకోవచ్చు. ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని..అందులో 2-3 చుక్కల నెయ్యి వేయాలి. నెయ్యి గిన్నెలో కింద ఉండిపోతే అది నకిలీ అని అర్ధం చేసుకోవచ్చు. అదే నెయ్యి పైనే ఉంటే అసలైందని అర్ధం. 


2. చేతిలో నెయ్యి తీసుకుని..గుర్తించవచ్చు. కొద్దిగా నెయ్యిని మీ చేతిలో తీసుకుని 5-6 నిమిషాలుంచాలి. తరువాత వాసన ఇంకా ఘుమఘుమలాడుతుంటే అసలు నెయ్యి అని అర్ధం. లేదా కాస్త విచిత్రమైన వాసన ఉంటే మాత్రం నకిలీదిగా గుర్తించవచ్చు.


3. నెయ్యిని ఉడికించడం ద్వారా కూడా అసలు, నకిలీ ఏదనేది తెలుసుకోవచ్చు. 1-2 స్పూన్ల నెయ్యిని ఉడికించాలి. ఆ తరువాత ఓ 24 గంటలు విడిగా ఉంచేయాలి. మంచి సువాసనతో పాటు గింజలు గింజలుగా ఉంటే అసలు నెయ్యి అని అర్ధం. వాసన బాగాలేకపోతే నకిలీ నెయ్యిగా గుర్తించవచ్చు.


Also read; Mouth Wash Benefits: నోటి దుర్వాసన సమస్యగా మారిందా..హోమ్‌మేడ్ మౌత్ వాష్ ఇలా తయారు చేసుకోండి



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook