Tips to lose Weight: ప్రస్తుతం అందర్నీ వేధించేది ఒకే ఒక సమస్య బరువు.  లేదా లావవడం. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు అందరూ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా చేస్తే కేవలం వారం వ్యవధిలోనే ఫలితాలు చూడవచ్చు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గడానికి, లావు తగ్గేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికోసం కొన్ని సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంటాయి. రకరకాల డైటింగ్ ప్లాన్స్, ఎక్సర్‌సైజ్ ఇలా ఎవరికి ఏది నచ్చితే అది ఫాలో అయిపోతుంటారు. కొందరి ప్రయత్నాలు ఫలిస్తుంటే..మరికొందరికి నిరాశ ఎదురవుతుంటుంది. ఈ క్రమంలో బెస్ట్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ మీ కోసం అందిస్తున్నాం. ఇది తూచా తప్పకుండా అమలు చేస్తే కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఫలితం కన్పిస్తుంది. 4 నెలల్లోనే మీరు ఊహించినట్టుగానే బరువు ( Weight Loss Plan) తగ్గుతారు. నిపుణులు చెబుతున్న ఆ ఏడు అద్బుతమైన టిప్స్ ఇవే.


1. ముందుగా వెయిట్ లాస్ డైట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి. కేవలం వర్కవుట్స్ ద్వారా బరువు తగ్గుతుందనుకుంటే చాలా పొరపాటు. డైట్ 80 శాతం, వర్కవుట్ 20 శాతం ఉంటుంది. అందుకే వర్కవుట్ కంటే డైట్ ప్లాన్ కీలకం.


2. ప్రతిరోజూ మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్ (Carbohydrates) పరిమాణం చూసుకోవల్సిందే. కార్బోహైడ్రేట్స్ నియంత్రించుకుంటే చాలావరకూ బరువు తగ్గుతాం. వెయిట్ లాస్ ప్లాన్‌లో ఇదే కీలకం. మనకు తెలియకుండానే అనునిత్యం చాలా కార్బొహైడ్రేట్స్ తీసుకుంటుంటాం.


3. సాధ్యమైనంతగా ఎక్కువ కూరగాయలు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. క్యాబేజ్, కాలిఫ్లవర్, స్పినాచ్, టొమాటో, కాప్సికమ్, బెల్ పెప్పర్స్, బ్రోకోలి, మష్రూమ్‌లలో కార్బోహైడ్రేట్లు తక్కువ పరిమాణంలో ఉంటాయి.


4. మీ ఆకలిని నియంత్రించుకోండి. ఎప్పుడు మీకు ఆకలేసినా..తెలిసో తెలియకో పెద్దఎత్తున కార్బొహైడ్రేట్స్ తీసుకుంటుంటాం.  అందుకే అలా చేయకుండా ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. దాంతోపాటు తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోండి.


5. సాధ్యమైనంతవరకూ ఇంటి ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఇండియన్ మేడ్ హోమ్ ఫుడ్ గొప్పతనం ఏంటంటే..అందులో న్యూట్రియంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే బయటి తిండిని తగ్గించి..ఇంటి ఫుడ్‌కు ప్రాధాన్యత ఇవ్వండి.


6. ఎక్సర్‌సైజ్ ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నం వేగవంతం చేయండి. మీ బరువు తగ్గడంలో ఎక్సర్‌సైజ్ కీలక పాత్ర పోషిస్తుంది. 


7. ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండటం నేర్చుకోండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు ఏం తింటున్నారనేది మీకు అవగాహన వస్తుంది. తద్వారా కొత్త ఆలోచనలు వస్తాయి. ఇలా చేస్తే కచ్చితంగా వెయిట్ లాస్ అవుతాం.


Also read; Best Christmas Greetings: మీ స్నేహితులు, బంధువుల కోసం బెస్ట్ క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook