Mirchi Bajji Recipe: మిరపకాయ బజ్జీని భారతదేశం అంతటా ఒకే విధంగా తయారు చేస్తారు. మిర్చి బజ్జీ అనేది శెనగపిండి, మసాలాలు మరియు పచ్చి మిరపకాయలతో తయారు చేసే చిరుతిండి. దీని కోసం ఉల్లిపాయలు, కొత్తిమీర ఆకులు, ఉప్పు, నిమ్మరసం, ఎర్ర మిరపకాయల మిశ్రమంతో బజ్జీలను నింపాలి. దీని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా దీని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం వేడి వేడి తినాలి అనిపించే వాటిలో ఇది ఒకటి. తప్పుకుండా ప్రతిఒక్కరికి ఎంతో నచ్చుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిర్చి బజ్జీ కి కావాల్సిన పదార్థాలు: 


ఒక కప్పు శనగ పిండి, పది బజ్జీ మిరపకాయలు, ¼ టేబుల్‌ స్పూన్‌ సోడా ఉప్పు, చింతపండు, రెండు  టేబుల్‌ స్పూన్‌ వాము, ఒక టేబుల్‌ స్పూన్ ఆమ్‌ చూర్‌ పొడి, ఉప్పు, నూనె


మిర్చి బజ్జీ తయారు చేయడం ఎలా: 


ముందుగా శనగ పిండి, ఆమ్ చూర్ పొడి మిక్సీలో వేసి పొడి చేయాలి. ఇందులో ఒక టేబుల్‌ స్పూన్ పొడిని పక్కకు తీసుకోవాలి. తరువాత చింతపండు ను ఉడికించి పేస్ట్ చేయాలి. ముందుగా చేసిన పొడిని , చింతపండు గుజ్జును, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. బజ్జీ మిరపకాయలను శుభ్రంగా కడిగి నిలువుగా  కోసుకోవాలి. లోపల గింజలు తీసేసి తయారు చేసిన  మిశ్రమాన్ని మిర్చిలలో కూరి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగ పిండి, బియ్యం పిండి, వంట సోడా, ఉప్పు, వాము, ఆమ్ చూర్ పొడి వేసి ఒకసారి కలపాలి. తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి మరీ జారుగా పిండిని కలపాలి.కడాయి లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక్కో మిర్చీని శనగ పిండి లో ముంచి నూనెలో వేసుకోవాలి. ఈ విధంగా బజ్జీలను వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఎంతో రుచికరమైన బజ్జీలు రెడీ.


Also Read  Andhra Chilli Chicken Recipe: ఆంధ్ర స్టైల్‌లో చిల్లి చికెన్ తయారీ విధానం.. ఈ స్టైల్ లో చేస్తే గిన్నెలు మొత్తం ఖాళీ అవ్వాల్సిందే..


Also Read  Poha: అటుకులతో ఉప్మా...పదే నిమిషాల్లోనే రెడీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter