Capsicum Rice Recipe: క్యాప్సికం రైస్ తయారు చేసుకోండి ఇలా!
Capsicum Rice Recipe: క్యాప్సికంతో చేసే రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీని పిల్లల నుంచి చిన్న పిల్లల వరకు ఇష్టంగా తింటారు. దీని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
Capsicum Rice Recipe: మనం రైస్ ఐటమ్స్ ను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకొనే రైస్ ఐటమ్స్ లో క్యాప్సికం రైస్ కూడా ఒకటి. క్యాప్సికంతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు.
క్యాప్సికం రైస్ కి కావాల్సిన పదార్థాలు:
నూనె, ఆవాలు, జీలకర్ర , ఎండుమిర్చి, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు , కారం, గరం మసాలా, తరిగిన టమాట, పొడుగ్గా తరిగిన క్యాప్సికం, తరిగిన పచ్చిమిర్చి, అన్నం, నిమ్మకాయ, తరిగిన కొత్తిమీర
క్యాప్సికం రైస్ తయారీ విధానం:
ముందుగా కళాయిలో నూనె వేడి చేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వీటిని మెత్తబడే వరకు వేయించిన తరువాత అన్నం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత నిమ్మకాయ రసం, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం రైస్ తయారవుతుంది.
Also Read Painkiller Vs Gel: పెయిన్ కిల్లర్, జెల్ పెయిన్ రిలీఫ్ విటిలో ఏది తీసుకుకుంటే చాలా బెటర్ ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter