Hyderabad Biryani Recipe: హైదరాబాద్ అంటేనే బిర్యానీ,  బిర్యానీ అంటేనే హైదరాబాద్ అంతలా పేరు మారు మోగిపోతుంది. అయితే ఈ రుచికరమైన హైదరాబాద్ చికెన్ బిర్యాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందులో రుచికరమైన పెరుగుతో పాటు మన కుంకుమపువ్వు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి తయారు చేస్తారు దీన్ని పెరుగు లేదా రైతా లేదా సలాన్‌తో కలిపి తీసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిర్యానీకి కావలసిన పదార్థాలు.
బాస్మతి రైస్ -2 కప్పులు
నీళ్లు -4 కప్పులు 
లవంగాలు-  4
యాలకులు -3
దాల్చిన చెక్క ఒక ఇంచు 
బిర్యానీ ఆకు -2
 ఉప్పు రుచికి సరిపడా


బిర్యానీ మ్యారినేషన్ కి కావలసిన పదార్థాలు..
కట్ చేసిన చికెన్ అరకిలో ,పెరుగు ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు ,కారంపొడి ఒక టేబుల్ స్పూన్, పసుపు అర టేబుల్ స్పూను, గరం మసాలా ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ,జీలకర్ర పొడి అర టేబుల్ స్పూను నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా.


ఉల్లిపాయలు- 2 పెద్దవి స్లైసులుగా కట్ చేసుకోవాలి, అరకప్పు నెయ్యి ,అర కప్పు పాలు, కుంకుమపువ్వు చిటికెడు, గోరువెచ్చని పాలు రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి.


ఇదీ చదవండి: తెల్ల వెంట్రుకలను శాశ్వతంగా నల్లగా మార్చే పెప్పర్ హెయిర్ డై ఇలా సింపుల్ గా చేసుకోండి..


తయారు చేసుకునే విధానం
బిర్యానీ రైస్ ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో నాలుకప్పుల నీళ్లు పోసి ఉడికించుకోవాలి అందులోనే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ,బిర్యాని ఆకు ఉప్పు వేసి కలపాలి ఇందులో ఇప్పుడు బియ్యం వేసి 70% వరకు ఉడికించుకొని పెట్టుకోవాలి.ఆ తర్వాత నీళ్లు వంపేయాలి.


చికెన్ మ్యారినేషన్ కి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు,కారం, గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ,లెమన్ జ్యూస్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఓ గంట డి ఫ్రీజర్ లో పెట్టి మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకోవాలి.
ఉల్లిపాయలను తీసి పక్కన పెట్టుకోవాలి.


కొన్ని ఉల్లిపాయాల కొన్ని అలాగే పెట్టి అందులోనే చికెన్‌ కూడా వేసి ఒక 15 నిమిషాల చికెన్ తో  పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు పాలు రెండు టేబుల్ స్పూన్ల పాలు వేడి చేసి అందులో కుంకుమపువ్వు వేయాలి.


ఇదీ చదవండి: మీ ఫ్రెండ్స్ తో ఒక్కసారైనా రోడ్ ట్రిప్ వెళ్లాల్సిన టాప్ 7 రోడ్డు మార్గాలు ఇవే..


 ఒక పెద్ద మందపాటి గిన్నె తీసుకొని అందులో చికెన్ సగం ఉడికినది ఒక లేయర్ వేసి అందులో పైనుంచి రైస్ వెయ్యాలి. ఇప్పుడు కట్ చేసిన పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసి కుంకుమపువ్వు పాలు పోయాలి. ఆ తర్వాత మళ్లీ అదే విధంగా రైస్‌, కూర, పుదీనా కొత్తిమీర వేసి చివరగా రోజ్ వాటర్ బిర్యానీ మసాలా తీవ్ర వాటర్ జల్లుకోవాలి.మూత గట్టిగా పెట్టుకొని సీల్ చేసుకోవాలి 25 నిమిషాలు ఉడికించాలి. అందులో 10 నిమిషాలు హై ఫ్లేమ్ పైన మిగతా 15 నిమిషాలు లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. చివరగా రైతా లేదా సాలన్‌తో ఈ రైస్ ఆస్వాదిస్తే రుచికరంగా ఉంటుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.