Easy Homemade Potato Twisters recipe: బంగాళదుంపతో ఏ కూర చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ బంగాళదుంపలో మనం ఇప్పటివరకు కూర, వేపుడు, బజ్జీలు మాత్రమే చేసుకున్నాం ఇకపై ట్విస్టర్స్ కూడా ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ట్విస్టర్స్‌ పిల్లలు ఈజీగా ఎంతో ఆస్వాదిస్తూ తింటారు. ఈ మధ్యకాలంలో బంగాళా దుంప తో తయారు చేసిన ట్విస్టర్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇంట్లో ఓవెన్ ఉంటే చాలు సులభంగా ఈ బంగాళా దుంపతో మనం కూడా ఎంచక్కా పొటాటో ట్విస్టర్స్ తయారు చేసుకోవచ్చు. ఇది మీ పిల్లలకు స్నాక్స్ రూపంలో ఇస్తే ఎంతో ఆస్వాదిస్తూ హాయిగా తింటారు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావలసిన పదార్థాలు
పెద్ద బంగాళదుంపలు -2 
ఆలివ్ ఆయిల్ -రెండు టేబుల్ స్పూన్ల 
పెప్రికా పౌడర్ -ఒక టేబుల్ స్పూన్  
 వెల్లుల్లి పొడి -ఒక టేబుల్ స్పూన్
 ఆనియన్ పొడి -ఒక టేబుల్ స్పూన్
 ఉప్పు, మిరియాల పొడి-రుచికి సరిపడా
బంగాళదుంపలు ట్విస్టర్స్ తయారు చేయడానికి ఒక ఉడెన్ స్క్యూవర్


ఇదీ చదవండి: రుచికరమైన పంజాబీ స్టైల్ రాజ్మా రైస్ రెసిపీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..


పొటాటో ట్విస్టర్స్  తయారు చేసుకునే విధానం..
ముందుగా బంగాళాదుంపలు తీసుకొని శుభ్రంగా కడగాలి. ఒకవేళ మీరు తొక్కతో పాటు ట్విస్టర్స్ తయారు చేసుకుంటే అలాగే ఉంచండి లేకపోతే తొక్క తీసి పెట్టుకోండి. ఏ విధంగా తయారుచేసిన పొటాటో ట్విస్టర్ రుచి అదిరిపోతుంది. ఇప్పుడు ఈ పొటాటోలని పొటాటో స్క్యూవర్ జాగ్రత్తగా గుచ్చండి.


ఇప్పుడు ట్విస్టర్ షేప్ రావడానికి ఒక పదునైన కత్తి తీసుకొని గుండ్రంగా స్పైరల్‌ షేప్‌లో ఎక్కడా విడిపోకుండా కట్ చేస్తూ ఉండాలి. ఇది ఎక్కడ నుంచి మొదలు పెట్టామో రౌండ్ గా తిరిగి అదే ప్లేస్ కి రావాలి. అలా ట్విస్ట్ చేస్తూ సన్నగా బంగాళదుంపలు కట్ చేస్తూ ఉండాలి సపరేట్ కాకుండా ఆ స్పైరల్ షేప్ లో మనకు బంగాళదుంప కట్ చేసుకోవాలి. సన్నని స్లైసుల మాదిరి బంగాళదుంపలు కట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి.


ఇదీ చదవండి: బెల్లీ ఫ్యాట్ బర్న్‌ చేసే పండ్లు..  ఈ సమయంలో తింటే సొగసైన ఆకృతి మీ సొంతం..


ఇప్పుడు మనం సీజనింగ్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి పొడి ఉల్లిపాయ పొడి, పెపరిక ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బ్రష్ సాయంతో ఈ పొటాటో స్పైరల్స్‌కు ఈ సీజనింగ్ కి అప్లై చేస్తూ ఉండాలి .అన్ని వైపులా సీజనింగ్ అప్లై చేయాలి.


ఇప్పుడు ఓవెన్ ముందుగానే నాలుగు వందల ఫారం డిగ్రీస్ అంటే 200C లో ప్రీ హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక బేకింగ్ షీట్ కూడా పెట్టి అందులో ఈ పొటాటోస్ క్యూవర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొటాటోలను గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు అరగంట వరకు హీట్ చేసుకోవాలి. వీటిని చల్లగా అయ్యాక ఆస్వాదిస్తే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇవి ఎంతో క్రిస్పీగా తయారవుతాయి. వీటిని మీకు కావాలంటే మీకు ఇష్టమైన చీజ్‌ సాస్‌లో కూడా డిప్ చేసుకొని ఆస్వాదించవచ్చు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి