Goan Fish Curry Recipe: గోవా ఫిష్ కర్రీ మంచి అరోమా కలిగి ఉంటుంది. ఇది మసాలాలు, జీలకర్ర, ధనియాలు, రెడ్ చిల్లి పసుపుపంటలు వేసుకుని తయారు చేస్తారు. వేడివేడిగా ఆస్వాదిస్తే ఈ గోవా అండ్ ఫిష్ కర్రీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ గోవా ఫిష్ కర్రీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావలసిన పదార్థాలు..
గ్రేట్ చేసిన కొబ్బరి ఒక కప్పు, ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఎండుమిర్చి ఎనిమిది పసుపు ఒక టేబుల్ స్పూన్ ఒక ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లము. అరకిలో చేపలు రెండు టేబుల్ స్పూన్ల నూనె టమాటాలు -2, పచ్చిమిర్చి -రెండు, చింతపండు పేస్టు -2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు ఉప్పు రుచికి సరిపడా నిమ్మరసం.


ముందుగా ఇది దీనికి కర్రీ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం
ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ధనియాలు, జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఎండుమిర్చి కొబ్బరి పసుపు కట్ చేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం కూడా వేసి మెత్తని పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఇందులో కావలిస్తే కొన్ని నీళ్లు కూడా పోసుకొని పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి.
ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో మీడియం హిట్ లో పెట్టి నూనె పోసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేవరకు వేయించుకోవాలి.


ఇదీ చదవండి: రేపు భారత్‌తోపాటు ఈ 5 దేశాలకు కూడా ఇండిపెన్‌డెన్స్‌ డే.. ఆ దేశాలు ఏవో తెలుసా?


 ఆ తర్వాత టమాటాలు వేసి కలుపుకోవాలి మెత్తగా ఉడకాలి. దీనికి మనం ఇదివరకు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీ పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. ఏడు నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు చింతపండు గుజ్జు కావాల్సినన్ని నేను కూడా పోసి కొన్ని నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులోనే కొబ్బరి నీళ్ళు కూడా వేసి సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న చేపలను వేసి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చాపలు మెత్తగా ఉడికిన తర్వాత జాగ్రత్త ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్పు రుచి చూసుకోవాలి. కావలిస్తే మళ్ళీ వేసుకోవచ్చు పైనుంచి పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా వేడిలోనే ఉంచాలి తర్వాత ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసి వేడివేడిగా రైస్ లో తింటే బాగుంటుంది. దీనిపై నుంచి నిమ్మరసం కూడా చల్లుకొని ఆస్వాదించుకోవచ్చు(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 


ఇదీ చదవండి:  రేపు దేశవ్యాప్తంగా అంబరాన్నంటనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 4000 మంది ప్రత్యేక అతిథులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter