Hotel style Veg Khorma Recipe: వేడివేడిగా హోటల్ స్టైల్‌లో వెజ్‌ కుర్మాను ఇంట్లో తయారు చేయండి. రుచి అదిరిపోతుంది. సాధారణంగా ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ సమయంలో హడావుడిగా ఏదో ఒక రిసిపీ చేస్తాం. ఒక్కరోజూ దోశ, మరో రోజు పూరీ, మరోసారి చపాతీ ఇలా ఏది ఈజీ అయితే అది చేసుకుంటాం. అయితే, ఈరోజు మనం చేయబోయే కుర్మా చపాతీ, పూరీ రెండిటిలోకి బెస్ట్‌ కాంబినేషన్. తక్కువ సమయంలో ఎంతో రుచిగా ఈ కుర్మా ట్రై చేయండి, రుచికి రుచి త్వరగా అవుతుంది కూడా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెజ్ కుర్మా చేయడానికి కావలసిన పదార్థాలు..
తురిమిన కొబ్బరి - పావు కప్పు
పచ్చిమిర్చి - 3
జీడిపప్పు - 7
గసగసాలు - 1 tbsp
బిర్యానీ ఆకు - 1
ఉల్లిపాయ - 1
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
టొమాటో - 1
ఉప్పు - రుచికి సరిపడా
సోంపు - 1/2 tbsp
దాల్చిన చెక్క - అర అంగుళం
లవంగాలు - 4
యాలకులు - 2
బంగాళదుంప-2
క్యారట్-1


ఇదీ చదవండి: సాధారణ టీ బదులుగా లెమన్ టీ తాగండి.. ఈ మిరాకిల్ మార్పులు మీ శరీరంలో చూడండి..
హోట్‌ స్టైల్ వెజిటేబుల్ కుర్మా తయారు చేసుకునే విధానం..
ముందుగా కొబ్బరి, గసాలు, జీడిపప్పు సన్నగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్‌ చేసి ఓ మందపాటి ప్యాన్‌ పెట్టుకోవాలి. ఇందులో నూనె పోయాలి. నూనె వేడయ్యాక సోంపు, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.  ఆ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, క్యారట్‌ కూడా వేసుకోవాలి. ఉప్పు రుచి చూసి వేసుకోవాలి. వేగిన తర్వాత సన్నగా తరిగి టమాట కూడా వేసుకోవాలి. అది మగ్గి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.


ఇదీ చదవండి: డ్రాగన్‌ ఫ్రూట్‌ ఆరోగ్యానికే కాదు.. ఇలా చేస్తే రేడియంట్‌ స్కిన్‌ మీసొంతం..


ఇప్పుడు ఇందులో మీకు గ్రేవీ ఎంత మేర కావాలో సరి చూసుకొని నీళ్లు పోసుకోవాలి. ఓ 15 నిమిషాల పాటు కూరగాయలు పూర్తిగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి