Hyderabadi Chicken Gravy Recipe: సండే వచ్చిందంటే చాలు.. చికెన్, మటన్‌, చేపలు వండుకునే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే ఈరోజు హాలిడే. అయితే, మొదటగా అందరికీ గుర్తుకు వచ్చేది మాత్రం చికెన్. దీంతో రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు. చికెన్‌తో ఏ రిపిసీ ట్రై చేసినా బాగుంటుంది. అందుకే మటన్ కంటే కూడా చికెన్‌కు ఎక్కువ ఫ్యాన్స్‌ ఉన్నారు. అంతేకాదు మటన్ తో పోలిస్తే చికెన్‌ ధర కూడా తక్కువ. చికెన్ తో బిర్యానీ, కడాయి చికెన్, బట్టర్ చికెన్, చికెన్ 65, చికెన్‌ ఫ్రై వంటి రకరకాల వెరైటీలు తయారు చేసుకుంటాం. అయితే, ఈసారి మీరు గ్రేవీగా తయారు చేసుకోవాలంటే ఈ సండే హైదరాబాదీ స్టైల్ స్పైసీ చికెన్‌ గ్రేవీ తయారు చేసుకోండి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీలు రెండిటికీ అద్భుతంగా ఉంటుంది. ఈ రిసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి: రుచికరమైన క్రీమీ మలై చికెన్ కర్రీ రిసిపీ ఎలా తయారు చేసుకోవాలి?


కావాల్సిన పదార్థాలు..
చికెన్ - 1/2 KG
పసుపు - 1/4 tbsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 tbsp
పెరుగు - 1 tbsp
ఉప్పు - రుచికి సరిపడా
పెద్ద ఉల్లిపాయ - 2
టొమాటో - 1
నూనె - 2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - 1
లవంగాలు - 3
కొత్తిమీర - కొద్దిగా
కారం పొడి - 1 tbsp
ధనియాల పొడి - 1 tbsp
గరం మసాలా - 1 tsp
స్టార్ సోంపు - 1
కరివేపాకు - కట్ట


ఇదీ చదవండి:  రుచికరమైన వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ.. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీ..


స్పైసీ చికెన్‌ గ్రేవీ తయారీ విధానం..
ముందుగా చికెన్‌ శుభ్రంగా కడగాలి. ఇందులో పెరుగు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, మరాఠీ మేతీ, లవంగాలు, చెక్క, ధనియాల పొడి వేసి ఓ అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఓ కడాయి తీసుకుని అందులో నూనె వేసి సోంపు ఉల్లిపాయలు వేసి గోల్డెన్‌ బ్రౌన్‌ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కారం, ఉప్పు కూడా వేసి టమాటాలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి నూనె వేరుగా అయ్యే వరకు అంటే టమాటాలు పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులో మ్యారినేషన్ చేసి నానబెట్టుకున్న చికెన్ కూడా వేయాలి. ఇది కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత మీకు గ్రేవీ ఎంత పరిమాణంలో కావాలో నీరు పోసి ఓ పదినిమిషాలు మీడియం మంటపై ఉడికించుకోవాలి. చివరగా ఉప్పు రుచి చూడాలి. ఆ తర్వాత ఆయిల్‌ వేరు అవుతుంది. ఇందులో కొత్తిమీరా, ధనియాల పొడివేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికరమైన వేడివేడి స్పైసీ చికెన్ గ్రేవీ రెడీ. ఇది అన్నం, చపాతీల్లోకి తింటే అద్భుతంగా ఉంటుంది.

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి