Veg Fried Rice: రుచికరమైన వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ.. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీ..

Tasty Veg Fried Rice Recipe:వెజ్ ఫ్రైడ్ రైస్ ఈ చైనీస్ డిష్‌ అంటే అందరికీ ఇష్టం. దీన్ని త్వరగా తయారు చేసుకోవచ్చు. ఈ సూపర్ డిష్‌ ను పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 20, 2024, 05:55 PM IST
Veg Fried Rice: రుచికరమైన వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ.. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీ..

Tasty Veg Fried Rice Recipe:వెజ్ ఫ్రైడ్ రైస్ ఈ చైనీస్ డిష్‌ అంటే అందరికీ ఇష్టం. దీన్ని త్వరగా తయారు చేసుకోవచ్చు. ఈ సూపర్ డిష్‌ ను పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇందులో వెజిటేబుల్స్ మసాలాలు వేసి తయారు చేసుకుంటారు. వెజ్ ఫ్రైడ్ రైస్ వివిధ రకాల కూరగాయలు వేసుకుని కేవలం 30 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. రుచికరమైన వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం తెలుసుకుందాం. ఇందులో కావాలంటే పన్నీరు తోపు కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు. అప్పుడు ఇది ప్రోటీన్ రిచ్ వెజ్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది.  ఈ రిసిపీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు...
 అన్నం -రెండు కప్పులు
 సోయాసాస్ -1 TBSP
కట్ చేసిన వెల్లుల్లి -1TBSP 
క్యారెట్ -1/4 కప్పు
క్యాబేజీ -1/4 కప్పు
గ్రీన్ ఆనియన్-1/4 కప్పు
నల్ల మిరియాలు -తగినంత
సన్ఫ్లవర్ ఆయిల్ -2 TBSP 
వెనిగర్ -1TBSP
ఆనియన్ -1/4
రెడ్ బెల్ పేప్పర్-1/4
గ్రీన్ బీన్స్ -1/4
ఉప్పు రుచికి సరిపడా

ఇదీ చదవండి: స్పైసీ ఎగ్ కీమా లంచ్ కి తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది..

తయారీ విధానం..
ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెసిపీని లంచ్ లేదా డిన్నర్ లోకి తయారు చేసుకోవచ్చు. ముందుగా పైన చెప్పిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అందులో వేసి కట్ చేసిన వెల్లుల్లి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇందులో వెజిటేబుల్స్ కూడా వేసి కొద్దిగా నాలుగు నిమిషాల పాటు వేయించుకోండి.

ఇదీ చదవండి: ఈ సమ్మర్ కూలింగ్‌ డిటాక్స్‌ డ్రింక్స్‌తో బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు..

ఇప్పుడు అందులోకి సోయాసాస్, వెనిగర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మంట పరిమాణం పెంచి బాగా కలుపుకోవాలి చివరగా ఉప్పు, మిరియాల పొడి రుచికి సరిపడా వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలిఉడికిన తర్వాత అన్నం కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి.రుచికరమైన ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది దీన్ని చిల్లీ పనీర్, మంచూరియా తో తింటే రుచి అదిరిపోతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News