Mango Shahi tukda: మ్యాంగో షాహీ తుకుడా రుచికరంగా.. సింపుల్‌గా ఇలా తయారు చేసుకోవచ్చు..
Mango Shahi tukda Recipe: మామిడిపండును నేరుగా తింటాం. వివిధ రకాల మామిడి పండ్లను మన డైట్ లో చేర్చుకుంటాం. ఎండాకాలం మామిడి పండ్లు విపరీతంగా కనిపిస్తాయి. దీంతో స్వీట్ కూడా తయారు చేసుకుంటాం.
Mango Shahi tukda Recipe: మామిడిపండును నేరుగా తింటాం. వివిధ రకాల మామిడి పండ్లను మన డైట్ లో చేర్చుకుంటాం. ఎండాకాలం మామిడి పండ్లు విపరీతంగా కనిపిస్తాయి. దీంతో స్వీట్ కూడా తయారు చేసుకుంటాం. అయితే మామిడికాయతో మ్యాంగో షాహి తుకుడా ఎప్పుడైనా ప్రయత్నించారా? ఇది చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అది ఎలానో తెలుసుకుందాం.
రబ్డి తయారీకి..
ఒక లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్
అరకప్పు చక్కెర
అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి
కుంకుమపువ్వు
కట్ చేసిన జీడిపప్పు బాదంపప్పు పిస్తాలు
మ్యాంగో పూరి తయారీకి..
రెండు బాగా పండిన మామిడి పండ్లు కట్ చేసుకుని పెట్టుకోవాలి
రెండు టేబుల్ స్పూన్ల చక్కర
ఒక లెమన్ జ్యూస్ పిండుకొని పెట్టుకోవాలి
ఇదీ చదవండి: ఎర్ర క్యాబేజీతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. ఈరోజే కొని తింటారు..
షాహీ తుకుడా తయారీ విధానం..
రబ్రి తయారు చేయడానికి ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో పాలు పోసి బాగా మరగ కాచుకోవాలి. తర్వాత మంట తగ్గించుకొని గట్టిపడకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టి పాలు తన ఒక 40 నిమిషాల సమయం వరకు అలాగే మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో చక్కెర యాలకుల పొడి కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి చక్కెర కలిసే వరకు ఐదు పది నిమిషాల తర్వాత చేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని అందులో తొక్క తీసేసిన మామిడి పండ్లను, చెక్కర, లెమన్ జ్యూస్ కూడా వేసి మ్యాంగో ప్యూరీ తయారు చేసుకోవాలి.
ఇదీ చదవండి: బంగాళదుంప స్వీట్ కార్న్ టిక్కీ రెసిపీ.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు..
ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని మీకు కావాల్సిన ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసి నెయ్యి లేదా నూనెలో మీడియం హిట్ పైన వేయించుకోవాలి
ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ లోకి మారాక పాన్ పైనుంచి తీసి ఒక పేపర్ టవల్ లో కాసేపు పెట్టాలి. ఇప్పుడు ఫ్రైడ్ బ్లడ్ ప్లేస్లను ఒక సర్వింగ్ ప్లేట్ లోకి పెట్టి అందులో రబ్రి పైనుంచి వేసుకోవాలి. దీనిపైన మనం తయారు చేసుకున్న మ్యాంగో ప్యూరిని కూడా ఒక లేయర్ లా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన బాదం పిస్తాలు పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. అంతే రుచికరమైన మ్యాంగో షాహితుకుడా రెడీ దీని వేడివేడిగా తీసుకోవచ్చు ఫ్రిజ్లో పెట్టి చల్లగా కూడా సేవించొచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి