Chicken Pakodi Recipe: చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. ఆదివారం వచ్చిందంటే చికెన్ తప్పకుండా తింటారు. ఎవరైనా బంధువులు వస్తే కూడా చికెన్ మటన్ చేపలు చేసుకుంటారు. అయితే చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. మీరు కూడా చికెన్ ప్రియులు అయితే ఈసారి చికెన్ పకోడీ ఇలా తయారు చేసుకోండి రుచి అదిరిపోతుంది. చికెన్ పకోడీ అంటేనే మన ఇండియన్ స్నాక్. వివిధ రకాల మసాలాలతో మ్యారినేట్ చేసి తయారుచేస్తారు. ఇది కాస్త క్రిస్పీగా వేడివేడిగా తీసుకుంటే ముఖ్యంగా ఈ వర్షాకాలం అదిరిపోతుంది మీరు కూడా ఈసారి ఇలా చికెన్ పకోడీ తయారు చేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చికెన్ పకోడీ తయారు కి కావలసిన పదార్థాలు..
చికెన్ బోన్ లెస్ -అరకేజీ
పెరుగు- ఒక కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - Tbsp
 పసుపు- Tbsp 
కారం- Tbsp 
గరం మసాలా - Tbsp
 జీలకర్ర - Tbsp
 ధనియాల పొడి - Tbsp
 నిమ్మరసం - Tbsp 
ఉప్పు రుచికి సరిపడా


మ్యారినేట్..
ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో రెండు స్పూన్ల బియ్యం పిండి, వాము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కారంపొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు కాస్త రుచికి సరిపడా చూసి నీళ్లు తీసుకోవాలి.


ఇదీ చదవండి: ఇదేంటి.. రైలు పట్టాలపై కాకుండా పంటపొలాల్లో నడుస్తోంది..? వీడియో చూడండి..!


చికెన్ పకోడీ తయారీ విధానం
స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి డీప్ ఫ్రైకి వేడి నూనె పోసి వేడి చేసుకోవాలి.
మరోవైపు చికెన్ మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కారం, గరం మసాలా ధనియాలు, జీలకర్ర పొడి నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. వీటికి చికెన్ కూడా జోడించి ముక్కలకు మసాలా పట్టే వరకు మొత్తం కలపాలి. ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ ను ఫ్రిజ్లో ఒక గంట పాటు అలాగే పెట్టాలి.


ఇప్పుడు మరో బౌల్ గిన్నె తీసుకొని అందులో శనగపిండి, బియ్యం పిండి వాము జీలకర్ర పసుపు కారం, ఉప్పు వేసి కలపాలి వీటికి కాస్త నీళ్లు కలుపుతూ బ్యాటర్ మాదిరి తయారు చేసుకోవాలి. నీరు ఎక్కువ కాకుండా చూసుకోవాలి చికెన్ పీసులకు ఇది కోటింగ్ మాదిరి పట్టాలి.


ఇదీ చదవండి: శనిదేవుడు వల్ల 2027 వరకు ఈ రాశులకు కష్టాలే ఉండవు.. సంపదల వర్షంతో రాజభోగాలు..!


ప్రతి ముక్కను ఈ మ్యారినేట్ చేసిన ముక్కను బ్యాటర్ లో వేసి అన్ని వైపులా కోట్ అయ్యేలా చూసుకొని వేడివేడి నూనెలో వేసుకోవాలి. అయితే మంటను మీడియం లో పెట్టండి లేకపోతే ముక్కలు కాలిపోతాయి. ఈ చికెన్ పకోడీ ఎరుపు రంగులో వచ్చే వరకు ఓ ఐదు నిమిషాల పాటు మీడియం మంటలో పెట్టి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని తీసి ఒక పేపర్ టవల్ లో వేసి నూనె అంతా పీల్చుకునే వరకు అలాగే ఉంచండి ఇప్పుడు దీని వేడి వేడిగా గ్రీన్ చట్నీ, చింతపండు చట్నీ, సాస్ లో డిప్ చేసుకొని తీసుకుంటే అదిరిపోతుంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి