Steamed Lemon Fish: సండే చికెన్‌, మటన్ మాత్రమే కాదు చేపలు కూడా తయారు చేసుకుంటారు. ముఖ్యంగా సీ ఫుడ్ లవర్స్ ఎక్కువగా ఉంటారు. మన సౌత్‌ ఇండియాలో సీఫుడ్ ఎక్కువగా తింటారు. చికెన్‌, మటన్ తినలేనివారికి మరో బెస్ట్‌ ఆప్షన్ చేప. ఇది ఎంతో రుచికరంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా చేపల విషయానికి వస్తే చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మన శరీరానికి కావాల్సిన ఆయిల్స్, విటమిన్స్, ఖనిజాలు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. చేపలతో రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఈ నోరూరించే లెమన్ ఫిష్‌ తయారు చేసుకుంటే ట్యాంగీ ఫ్లేవర్‌లో రుచికరంగా ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావాల్సిన పదార్థాలు..
ఫిష్-1
ఉల్లికాడలు- కప్పు
వెల్లుల్లి-2TBSP
దాల్చినచెక్క- 1
నిమ్మకాయ స్లైసెస్
రెడ్ బెల్‌ పెప్పర్-1
వర్జీన్ ఆలివ్ ఆయిల్- 2TBSP
అల్లం-2TBSP
జీలకర్ర పొడి -2TBSP
గ్రీన్ చిల్లీ-2
ఉప్పు- రుచికిసరిపడా
నీళ్లు - తగినంత


ఇదీ చదవండి: గుడ్లు లేదా గింజలు.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఏవి బెస్ట్‌..?


స్టీమ్డ్‌ లెమన్ ఫిష్ తయారీ విధానం..
చేపలను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఓ ప్లేట్‌లోకి తీసుకుని అందులో నిమ్మకాయ రసం, ఉప్పు వేసి మ్యారినేట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లికాడలు, బెల్‌ పెప్పర్, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి కట్‌ చేసుకుని ఓ బౌల్‌ లో వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఓ నాన్‌ స్టిక్ ప్యాన్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్‌ పెట్టాలి. ఇందులో నూనె వేసి వేడిచేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లికాడలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఓ నిమిషంపాటు ఉడికిన తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్‌ లో చేపను వేసి ఓ మూత పెట్టి కవర్ చేయాలి.  ఓ పది నిమిషాల పాటు సిమ్‌పై వండుకోవాలి.


ఇదీ చదవండి: రుచికరమైన చికెన్ సాల్నా ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా.?


ఆ తర్వాత మూత తీసి జీలకర్ర పొడిని వేసుకోవాలి. మళ్లీ కాసేపటి వరకు ఉడికించుకోవాలి.  మూత తీసి నీళ్లు పోయాలి. కాసేపటి తర్వాత ఉప్పు వేసి మరికొద్ది సమయం వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కాస్త ఉడుకుతుంది. ఓ 15 నిమిషాల తర్వాత గ్యాస్‌ ఆఫ్ చేయండి రుచికరమైన స్టీమ్డ్‌ లెమన్ ఫిష్‌ రెడీ. వేడివేడి చేపపై కొత్తిమీరాతో గార్నిష్‌ చేసుకోవాలి. పైన లెమన్ స్లైసులు, బెల్‌ పెప్పర్ తో అలంకరించుకుంటే రెడీ.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter