Tasty Prawns Curry recipe: ఎప్పుడు చికెన్, మటన్, చేపలు కాకుండా ఈసారి వీకెండ్ స్పెషల్ కాస్త వెరైటీగా ఏదైనా వండాలనుకుంటున్నారా?  మీరు నాన్ వెజ్ ప్రియులు అయితే ఈసారి ప్రాన్స్ వండుకోండి. ఈ విధంగా వండుకుంటే రుచి అదిరిపోతుంది. ప్రాన్స్ కర్రీ రుచికరంగా కొద్ది సమయంలోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రాన్స్ కర్రీ కి కావలసిన పదార్థాలు..
 ప్రాన్స్ -1/2 kg బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి
నూనె రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ఒకటి పెద్దది (సన్నగా కట్ చేసుకోవాలి)
టమాటా-2( సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి)
వెల్లుల్లి -2 రెబ్బలు 
ఒక ఇంచు అల్లం సన్నగా కట్ చేసినవి
పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్
 పసుపు ఒక టేబుల్ స్పూన్
 కారం ఒక టేబుల్ స్పూన్ 
ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ 
జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ 
గరం మసాలా 
ఒక కప్పు కొబ్బరి పాలు, 
ఉప్పు రుచికి సరిపడా
 కట్ చేసిన కొత్తిమీర


ఇదీ చదవండి:  టమాటా మిరియాల రసం ఇలా చేస్తే అన్నం పక్కనపెట్టి రసమే తాగేస్తారు..


రొయ్యల కూర వండుకునే విధానం..
ప్రాన్స్ శుభ్రంగా మరోసారి నీళ్లలో కడిగి ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని వేడి చేసి అందులో నూనె వేసి మీడియం మంటపై పెట్టుకోవాలి. అందులో సన్నగా కట్ చేసి నువ్వు ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి ,పచ్చిమిర్చి కూడా వేసి మరో మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసిన టమాటాలు కూడా వేసి బాగా మెత్తగా ఉడికే వరకు నూనె సపరేట్ అయ్యేవరకు కలపాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. 


ఇదీ చదవండి: ఈ 5 ఫుడ్స్‌ తిన్నారంటే బెల్లీఫ్యాట్‌ వెన్నలా కరిగిపోతుందంటే నమ్మండి..


ఇప్పుడు ఇందులోనే ప్రాన్స్ కూడా వేసి బాగా కలుపుకొని మరో నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.  రొయ్యల రంగు పింక్ కలర్ మారిపోతాయి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మంట తగ్గించుకొని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉప్పు రుచి చూసి తగ్గితే వేసుకోవాలి. చివరగా గరం మసాలా వేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకొని కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి వేడివేడిగా వడ్డించుకుంటే అన్నం నాన్లోకి రుచి అదిరిపోతుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి