Tasty Rajma Rice Recipe: రాజ్మా చావల్, రాజ్మా రైస్ రుచికరంగా ఉంటుంది. ఇది పంజాబీ లో చాలా ఫేమస్ వంటకం. దేశీ నెయ్యితో వేసుకొని ఈ చావల్ రెసిపీ చేసుకుంటే రుచి అదిరిపోతుంది. పంజాబీ స్టైల్ లో రైస్ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజ్మా చావాల్ రెసిపీ కి కావలసిన పదార్థాలు..
రాజ్మా -2 కప్పులు
 నీళ్లు -4 కప్పులు
 ఉప్పు రుచికి సరిపడా
 నెయ్యి -4 టేబుల్ స్పూన్లు
 ఉల్లిపాయలు- 4
అల్లం వెల్లుల్లి పేస్ట్-2 టేబుల్ స్పూన్లు
 టమాటాలు -3
 ధనియాల పొడి-1 tbsp
 జీలకర్ర పొడి - 1tbsp
 రెడ్ చిల్లి పొడి -1 tbsp
సోంపు పొడి-1/4 tbsp
ఇంగువ పొడి -1/2tbsp
పసుపు- 1tbsp
జీలకర్ర- 1tbsp
గ్రీన్ చిల్లీ-2
 గరం మసాలా - 1tbsp
కొత్తిమీర 
 రైస్ -ఒక కప్పు
రెండు కప్పుల నీరు


ఇదీ చదవండి:  బెల్లీ ఫ్యాట్ బర్న్‌ చేసే పండ్లు..  ఈ సమయంలో తింటే సొగసైన ఆకృతి మీ సొంతం..


రుచికరమైన రాజ్మా రైస్ తయారీ విధానం..
ముందుగా రాజ్మాను రాత్రంతా నానబెట్టుకోవాలి ఆ మరుసటి రోజు ఉదయం నానబెట్టిన రాజ్మాను నాలుగుసార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాజ్మాను ప్రెషర్ కుక్కర్ లో వేసి ఉప్పు కూడా వేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేవరకు తగినన్ని నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి.ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర వేసి చిటపటలాడించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిపి బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని వేసి ఓ ఆరు నిమిషాల వరకు ఉడికించుకోవాలి.


ఇదీ చదవండి: షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ 9 పండ్లను ఏ అపోహ లేకుండా హ్యాపీగా తినొచ్చు..


ఇదే సమయంలో మిగతా మసాలాలను కూడా వేసుకొని మూత పెట్టి నెయ్యి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన రాజ్మా కూడా నీటితో సహా వేసి ఉప్పు రుచి చూసుకోవాలి. కర్రీ దగ్గర పడే వరకు రుచి చూసుకొని వండుకోవాలి. మరో పాత్రలో  రైస్ ఉడికించుకోవాలి రాజ్మా కర్రీ రెడీ అయిపోయాక దానిపై కొత్తిమీర, నెయ్యి వేసి గార్నిష్ చేసుకోవాలి. దీన్ని ఉడికించుకున్న రైస్ లో వేసి తింటే రుచి అదిరిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి