Ragi face pack: రాగిపిండితో ఈ ఫేస్‌ప్యాక్ వేసుకోండి.. మీ ముఖానికి రెట్టింపు కాంతి..
Ragi face pack for Glowing Skin: రాగి అత్యంత ఆరోగ్యకరమైన ధాన్యం. ఇందులో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. అందుకే ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ మండు వేసవిలో మన శరీరానికి చల్లదనాన్నిస్తుంది.
Ragi face pack for Glowing Skin: రాగి అత్యంత ఆరోగ్యకరమైన ధాన్యం. ఇందులో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. అందుకే ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ మండు వేసవిలో మన శరీరానికి చల్లదనాన్నిస్తుంది. అయితే, రాగులతో కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు సౌందర్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
రాగి ఫేస్ ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
రాగి పిండి -2TBSP
పెరుగు-1 TBSP
తేనె-1 TBSP
నిమ్మరసం-1 TBSP
ఫేస్ ప్యాక్ తయారీ విధానం..
ఈ ఒక గిన్నె తీసుకుని అందులో ఈ పదార్థాలన్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంటే రెండు స్పూన్ల రాగిపిండి, ఒక స్పూన్ ప్లెయిన్ యోగార్ట్, ఒక స్పూన్ తేనె వేసుకుని బాగా ఫేస్ ప్యాక్ మాదిరి కలుపుకోవాలి. ఇందులో లెమన్ జ్యూస్ వేసుకుని ఒక టీ స్పూన్ వేసుకుని బాగా కలపాలి. నిమ్మరసం ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. అంతేకాదు ఇందులో విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ పేస్ట్ ను స్మూత్‌గా తయారు చేసుకోవాలి. పెరుగుతో ఫేస్ ప్యాక్ అడ్జస్ట్ చేసుకోవాలి.
ఈ తయారు చేసుకున్న ప్యాక్‌ను ముఖం, మెడ భాగాన అప్లై చేసుకోవాలి. మీ ముఖం ముందుగానే శుభ్రంగా కడగాలి. ముందుగా ముఖంపై ఏదైనా మేకప్ ఉంటే కూడా తొలగించండి. చేతి వేళ్ల సహాయంతో రాగి ఫేస్ ప్యాక్‌ను ముఖం అంతా రుద్దండి. మెడ భాగంపై ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకున్న 20 నిమిషాల వరకు ముఖాన్ని ఆరనివ్వండి. ఈ సమయంలో మీ ముఖం టైట్ అయిన అనుభూతి కూడా కలుగుతుంది.
ఇదీ చదవండి: ఈ 2 కిచెన్ వస్తువులు చాలు.. మీ ఫేస్ ఫేషియల్ చేసినట్లు మెరిసిపోతుంది..
ఆ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత మీ ముఖాన్ని సర్క్యూలర్ మోషన్లో రుద్దాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని రుద్దుతూ ముఖం కడిగేసుకోవాలి. చివరగా మీ ముఖాన్ని కాటన్ టవల్‌తో తుడుచుకుని మాయిశ్చరైజర్ అప్లే చేసుకోవాలి. దీంతో రోజంతా హైడ్రేటెడ్ గా ఉంటారు. ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వారానికి రెండు సార్లు వేసుకోవాలి. ఈ రాగి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మీ ముఖం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. ఇది మీ చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. ముఖం పై రంధ్రాలను తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే చల్లచల్లని స్పైసీ గుజరాతీ స్పెషల్ డ్రింక్..
ఇక ఈ ఫేస్ ప్యాక్‌లో వాడిన పెరుగు ముఖాన్ని ఎక్కువ సమయం హైడ్రేషన్ ఇస్తుంది. మీ ముఖం కూడా చాలా మృదువుగా మారిపోతుంది. అంతేకాదు ఈ రాగి ఫేస్ ప్యాక్‌లో మనం వినియోగించిన నిమ్మకాయ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ముఖం ఉండే నల్లని మచ్చలను తగ్గిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook