Snakes Repellers: అసలే కొద్ది రోజుల్లో వర్షాకాలం రాబోతోంది..కానీ ఇప్పుడే వర్షాలు అధికంగా పడుతుండడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఈ నీళ్లలో ఎక్కడి నుంచో పాములు కొట్టుకు వచ్చి ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ పాములు ఇళ్లల్లోకి రావడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రత్యేకించి చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతం. అయితే మరి అకారణంగా ఇంటి చుట్టుపక్కల కానీ ఇంట్లోకి కానీ పాములు వస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న చిట్కా మీరు పాటించినట్లయితే ఇది మీకు మీ ఇంటికి లక్ష్మణ రేఖ లా పనిచేస్తుంది.  మరి పాముల బెడద నుంచి తప్పించుకోవాలంటే మరి ఆ లక్ష్మణ రేఖ ఏంటో ఇప్పుడు చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి వర్షాల సమయంలో పాముల పుట్టలు,  రంద్రాలు నీటితో నిండిపోతాయి.  దీని కారణంగానే పాములు రక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. పొడి ప్రదేశంలో దాక్కుంటాయి. అందుకే ఇంటి చుట్టుపక్కల రంధ్రాలు పాములు దూరేందుకు అనుకూలంగా ఉండే ప్రదేశాలలో ఇవి ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అందుకే ఫినాయిల్ ద్రవాన్ని మీ ఇంటి చుట్టూ చల్లుకోవడం వల్ల పాములు ఇంటి దరిదాపుల్లో రావని చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంట్లోనే మూలలు, కోళ్ల గూడు,  పశువుల పాకలు, బాత్రూం వంటి ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సమయం కుదిరినప్పుడల్లా ఫినాయిల్ పిచికారి చేస్తే పాములు ప్రవేశించవని చెబుతున్నారు. 


ముఖ్యంగా దీని వాసనను పక్కన పెడితే ఇందులో ఉండే కార్బోలిక్ యాసిడ్ పాములకు అత్యంత ఇబ్బందిని కలిగిస్తాయి. అందుకే దీని వాసన పాములు,  తేళ్లు, క్రిములు ఇంట్లోకి రానివ్వకుండా చేస్తుంది. ఇంట్లోని చెత్త ప్రదేశాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.  ఈ ఫినాయిల్ అనేది మీరు పిచికారి చేయడం వల్ల ఇంటి చుట్టూ పాములు ఇంట్లోకి ప్రవేశించవు. అయితే బహిరంగ ప్రదేశంలో ఫినాయిల్ పిచికారి చేయడం వల్ల వర్షం పడినప్పుడు అది నీటితో పాటు వెళ్లిపోతుంది అందుకే మీరు ఇంటి చుట్టూ ఒరిజినల్ కార్బోలిక్ ఆసిడ్ని పిచికారీ చేస్తే దాని ప్రభావం ఒక వారం పాటు ఉంటుంది.ప్రత్యేకించి వర్షాకాలంలో వారానికి ఒకసారి ఈ పని చేస్తే మాత్రం పాముల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అంతేకాదు మీకు ఈ కార్బోలిక్ ఆసిడ్ అనేది లక్ష్మణ రేఖల పనిచేస్తుంది.


Also Readఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook