How To Wake Up Early In The Morning: చాలా మంది వివిధ పనులతో బిజీగా మారుతున్నారు. అయితే దీని కారణంగా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఉదయం త్వరగా లేవలేకపోతున్నారు. అంతేకాకుండా చాలా మంది అలారం పెట్టుకున్న లేవడం లేదు. అయితే కొందరూ లేచిన రోజంతా లేజీనెస్‌తో గడుపుతున్నారు. ప్రస్తుతం ఇది కూడా ఓ సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం చాలా మంచిది లేకపోతే ఇలా అలవాటుగా మారుతుంది. దీంతో భవిష్యత్‌లో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ఉదయాన్నే లేవడానికి ఇబ్బంది పడుతుంటే ఈ నివారణలు మీ కోసమే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1.  ఇలా మొబైల్‌  అలారం వినియోగించవద్దు:
సెల్ ఫోన్‌ ట్రెండ్‌గా మారకముందు చాలా మంది గడియారాన్ని అలారంగా వాడే వారు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల మొబైల్ లోనే అలారం సౌకర్యం ఉండడంతో వాటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఫోన్‌లో తాత్కాలికంగా ఆపివేయి బటన్ ఉండడం వల్ల టక్కునా దానిని ఆఫ్ చేస్తున్నారు.  దీని కారణంగా లేవలేకపోతున్నారు. దీంతో ఆలస్యంగా లేస్తున్నారు. కాబట్టి మీరు సాధరంగా వాడే అలారం గడియారాలను మాత్రమే వినియోగించాలి.


2. గోరువెచ్చని నీరు త్రాగండి:
భారతదేశంలో చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంది. దీనిని బెడ్ టీ అని కూడా పిలుస్తారు. కానీ అలా చేయడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం వంటి పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి టీలకు బదులుగా గోరువెచ్చని నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా మన శరీరం వెంటనే చురుకుగా మారుతుంది. మలబద్ధకం వివిధ రకాల సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి.  కావాలంటే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం తీసుకుంటే రెట్టింపు  ప్రయోజనాలు పొందుతారు. బరువు కూడా సులభంగా తగ్గుతారు.


3. చిన్నపాటి వ్యాయామాలు:
చాలా మంది నిద్ర లేచిన తర్వాత లేజిగా కనిపిస్తారు. అయితే ఇలాంటి వారు తప్పకుండా వ్యాయామాలు చేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also read: Jobs in Indian Army: ఇండియన్ ఆర్మీ నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌.. వీరు కూడా అప్లై చేసుకోవచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook