Jobs Notification in Indian Army: ఇండియన్ ఆర్మీ జాబ్‌ల కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్నవారికి ఇది గుడ్‌న్యూస్‌గా చెప్పొచ్చు. ఆర్మీ తన వెబ్‌సైట్ joinindianarmy.nic.in లో 10+2 TES 49 కోర్సులకు త్వరలోనే నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చదివిన 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ TES-49 కోర్సుకు అర్హులని ఆర్మీ తమ అధికార వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే ఈ కోర్స్‌లో జాయిన్ అయ్యేవారు తప్పకుండా JEE మెయిన్స్ 2022లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ అర్హతలుంటేనే వీటిని అర్హులని ఆర్మీ పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయోపరిమితి 16 సంవత్సరాలని ఆర్మీ అధికారి వెబ్ సైట్‌లో తెలిపింది. ఇక గరిష్ట వయోపరిమితి విషయానికొస్తే 19 సంవత్సరాల 6 నెలలని పేర్కొంది.
నోటిఫికేషన్ అప్పుడే:
ఇండియన్ ఆర్మీ TES కోర్సుల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 14 నుంచి ప్రారంభంకానుంది. అయితే ఇది డిసెంబర్ 14, 2022 వరకు కొనసాగనుంది. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా ఇంటర్‌కు సంబంధించిన మార్కులను దరఖాస్తు ఫారమ్‌లో తెలుపాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు విషయాలను అందులో సూచించాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ తర్వాత దరఖాస్తుదారులు SSB ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. దీని తర్వాత వైద్య పరీక్ష ఉంటాయి. అయితే ఇలా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 చెల్లిస్తుంది ఇండియన్ ఆర్మీ.
ఈ అర్హుతలు తప్పనిసరి:
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా అవివాహిత పురుషులుగా ఉండాలి:
(i) భారతదేశ పౌరుడై ఉండాలి.
(ii) నేపాల్‌కు చెందిన వ్యక్తి లేదా పాకిస్తాన్, బర్మా, శ్రీలంకలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కూడా అప్లై చేసుకోవచ్చు.
పైన పేర్కొన్న (ii) మరియు (iii) వర్గాలకు చెందిన భారత ప్రభుత్వం అనుకూలంగా అర్హత సర్టిఫికెట్ తప్పకుండా ఉంచుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం వివరణాత్మక నోటిఫికేషన్ కోసం వెబ్ సైట్‌లో వివరాలను చూడాల్సి ఉంటుంది.
Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook