Hyderabadi Pista House Style Haleem Recipe: ప్రపంచవ్యాప్తంగా రంజాన్ మాంసం ప్రారంభమైంది. ఈ సమయంలో చాలామంది సాయంత్రం పూట ఎక్కువగా హలీమ్‌ను తీసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. దీనిని అనేక రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా భారత్ లో అయితే చికెన్‌తో పాటు మటన్ హలీమ్ కూడా తయారు చేస్తారు. క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఇందులో అధిక పరిమాణంలో మసాలా దినుసులు ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా హాలీమ్‌ని తీసుకోవడం వల్ల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. అంతేకాకుండా శరీరానికి కూడా తక్షణ శక్తి లభిస్తుంది. అయితే ప్రస్తుతం చాలామంది బయట లభించే హలీమ్ ని ఎక్కువగా కొనుక్కొని తింటూ ఉంటారు. ఇకనుంచి బయటకొనక్కర్లేదు సులభమైన పద్ధతిలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే ఈ హలీమ్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హలీమ్‌ తయారీకి కావలసిన పదార్థాలు:
* 1 కిలో మటన్ లేదా చికెన్
* 1/2 కప్పు గోధుమలు
* 1/4 కప్పు బియ్యం
* 1/4 కప్పు పెసరపప్పు
* 1/4 కప్పు మినప్పప్పు
* 1/4 కప్పు శనగపప్పు
* 1/4 కప్పు ఉల్లిపాయలు (తరిగినవి)
* 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
* 1 టేబుల్ స్పూన్ కారం పొడి
* 1 టీస్పూన్ గరం మసాలా
* 1/2 టీస్పూన్ పసుపు
* 1/2 టీస్పూన్ జీలకర్ర
* 1/4 టీస్పూన్ యాలకుల పొడి
* 1/4 టీస్పూన్ లవంగాల పొడి
* 1/4 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి
* 1/4 టీస్పూన్ బియ్యం
* ఉప్పు రుచికి సరిపడా
* నెయ్యి / నూనె


తయారీ విధానం:
1. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మటన్ లేదా చికెన్ ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాల్సి ఉంటుంది.
2. ఆ తర్వాత మరో బౌల్ లో  గోధుమలు, బియ్యం, పప్పులను శుభ్రంగా కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
3. ఒక పెద్ద గిన్నెలో నెయ్యి/నూనె వేడి చేసి, ఉల్లిపాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
4. ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకోవాలి.
5. అందులోనే కారం పొడి, గరం మసాలా, పసుపు, జీలకర్ర, యాలకుల పొడి, లవంగాల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి 1 నిమిషం పాటు వేయించాలి.
6. ఆ తర్వాత బాగా వేగిన ఈ మసాలాలో మటన్ ముక్కలు వేసి, మాంసం రంగు మారే వరకు వేయించాలి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..
7. అందులోనే  నానబెట్టిన గోధుమలు, బియ్యం, పప్పులు, ఉప్పు వేసి బాగా కలపాలి.
8. బాగా కలిపిన తర్వాత 4-5 కప్పుల నీరు పోసి, మూత పెట్టి, మాంసం మెత్తబడే వరకు (సుమారు 4 నుంచి 5 గంటలు) బాగా ఉడికించాలి.
9. ఇలా ఉడికించే క్రమంలో తప్పకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి.
10. మాంసం మెత్తబడిన తర్వాత, ఒక గరిటెతో హలీమ్ ను మెత్తగా చేయాలి.
11. ఇలా మెత్తగా చేసిన తర్వాత మరో 1/2 గంట పాటు ఉడికించాలి.
12. హలీమ్ చిక్కబడిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి దాని పైనుంచి తగినంత నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కుంకుమపువ్వు వేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి.
13. ఆ తర్వాత హలీం పైనుంచి కొత్తిమీర చల్లి వేడిగా వడ్డించండి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి