Weight Loss ICMR Report: చాలామంది బరువు తగ్గాలి అని అనుకుంటూనే ఉంటారు. కానీ కొందరు మాత్రమే తగ్గడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వాళ్లలో కూడా ఒకేసారి ఎక్కువగా బరువు తగ్గిపోవాలని, కేవలం ఐదు, పది రోజుల్లోనే మంచి రిజల్ట్ కనిపించాలి అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ అంత వేగంగా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదేనా అని వాళ్ళు ఆలోచించరు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే ఐసిఎంఆర్ వారు తాజాగా ఒక నివేదికను విడుదల చేశారు. త్వరగా బరువు తగ్గడానికి మందులు తీసుకోవడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు అని సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా వారంలో ఆరోగ్యకరంగా ఎంత బరువు తగ్గొచ్చు అని కూడా ఐసిఎంఆర్ వారు నివేదికలో స్పష్టం చేశారు. 


ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా చాలామంది చిన్న వయసు నుంచి ఒబిసిటీ, అధిక బరువు, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే కొందరు బరువు తగ్గడం కోసం మందులు కూడా వాడడానికి రెడీ అయిపోతున్నారు. 


మందుల కారణంగా చాలా త్వరగా బరువు తగ్గిపోవచ్చు కానీ అది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు అని ఐసిఎంఆర్ వారు చెబుతున్నారు. చాలా త్వరగా బరువు కోల్పోవడం, స్థూలకాయానికి వ్యతిరేకంగా మందులు వాడటం ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయట. 


ఈ నేపథ్యంలో ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి తీసుకోవాల్సిన ఆహారపు పదార్థాల గురించి కూడా ఐ సి ఎం ఆర్ వారు తెలియజేశారు. తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, బీన్స్ వంటివి మన ఆహారంలో జత చేయడం వల్ల బరువు తగ్గవచ్చు అని, కొద్ది రోజులలోనే భారీ ఫలితం కనిపించకపోయినప్పటికీ ఈ డైట్ ని ఫాలో అయితే కచ్చితంగా త్వరగానే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయని వారు చెబుతున్నారు. 


మన BMI (బాడీ మాస్ ఇండెక్స్) 23 నుండి 27.5 కిలోలు ఉంటే అధిక బరువుగా పరిగణ లోకి తీసుకుంటారు. పట్టణ ప్రాంతాల్లో 30 శాతం మంది ఊబకాయంతో బాధపడుతుంటే, గ్రామీణ ప్రాంతాల్లో 16 శాతం పెద్దలు కూడా ఇదే ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు ఉన్నవాళ్లు దశల వారీగా బరువు తగ్గించే ప్రయత్నాలు చేయడం మంచిది అని వారు సూచిస్తున్నారు. 


మనం తీసుకునే ఆహారం 1000 కిలో కేలరీల కంటే తక్కువ ఉండకూడదట. ఆ ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలాగా చూసుకోవాలి. వారానికి అర కిలో బరువు తగ్గడం సురక్షితం అని నివేదికలో తెలియజేశారు. ప్రతిరోజూ శారీరక శ్రమ, యోగా, వర్కౌట్ చేయడం కూడా బరువు తగ్గడానికి మంచి మార్గాలు అని అంటున్నారు.


ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలు:


ఎక్కువగా కూరగాయలు తీసుకోవాలి. అందులో ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.


తృణధాన్యాలు, కమ్మని పెరుగు కూడా మన ఆహారంలో జత చేయాలి.


చర్మం లేకుండా పౌల్ట్రీ, మాంసం, చేపలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిదే.


సోడా, పండ్ల రసాలు వంటి చక్కెర పానీయాలకు దూరంగా ఉంటూ మంచి నీళ్ళు, హెర్బల్ టీ వంటి పానీయాలు తాగడం మంచిది.


Also read: Summer Tourism Tips: వేసవిలో ఈ 6 పర్యాటక ప్రాంతాల సందర్శన నరకమే



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook