Immunity Booster: రోగ నిరోధక శక్తి లోపం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి!
Immunity Booster: ప్రతిరోజు ఈ రెండు కషాయాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కషాయాలను తీసుకోవడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Immunity Booster: వాతావరణం లోని ఆకస్మిక మార్పుల కారణంగా చాలామందిలో రోగ నిరోధక శక్తి కోల్పోతున్నారు. ఈ శక్తిని కోల్పోవడం కారణంగా దగ్గు జలుబు సమస్యలే కాకుండా ఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నాయి. కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తి లోపం ఉంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం చాలామందిలో రోగనిరోధక శక్తి లోపం కారణంగా చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. దీని కారణంగా శరీరం అంద హీనంగా తయారవుతోంది. అంతేకాకుండా మరికొందరిలో జీర్ణ క్రియ దెబ్బతిని పొట్ట నొప్పితో పాటు ఆసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ క్రింది చిట్కాలను పాటిస్తే తక్కువ టైంలోనే మంచి ఫలితాలు పొందవచ్చు. ఏయే చిట్కాలు పాటించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి
రోగ నిరోధక శక్తి లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తులసి ఆకులను ప్రతిరోజు నమిలి తినాల్సి ఉంటుంది. అంతేకాకుండా తులసి తో తయారుచేసిన కషాయాన్ని కూడా ప్రతిరోజు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి లోపం నుంచి గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఈ కషాయాన్ని తయారు చేయడానికి ముందుగా 10 నుంచి 20 తులసి ఆకులను తీసుకొని నీటిలో బాగా మరిగించి.. అందులో రెండు దంచిన అల్లం ముక్కలను వేసి కషాయంలా తయారు చేసుకోవాలి. ఇలా మరిగించిన కషాయాన్ని ప్రతిరోజు రెండు పూటల తాగడం వల్ల సులభంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
రోగ నిరోధక శక్తి పెరగడానికి మరొక సాయం కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కషాయాన్ని తయారు చేయడానికి ముందుగా పచ్చి పసుపును తీసుకొని మిశ్రమంగా తయారు చేసుకోవాలి ఆ తర్వాత నీటిలో వేసుకొని బాగా మరిగించి కషాయంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని తాగడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి సులభంగా పెరిగి దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook