Improve Eyesight Naturally: కళ్లు తరచుగా మసక మసకగా కనిపిస్తున్నాయా? వీటిని రోజు తింటే 7 రోజు సమస్యకు చెక్!
How To Improve Eyesight Naturally At Home In 7 Days: కంటి చూపు సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఆహారాల్లో ఈ కింది కూరగాలు ప్రతి రోజు తీసుకుంటే గొప్ప ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
How To Improve Eyesight Naturally At Home In 7 Days: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు. దీని కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా శరీరంలోని పోషకాల లోపం కారణంగా కంటి చూపు సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే కంటి చూపు సమస్యలతో బాధపడేవారు చాలా వరకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు చూడడం వల్ల నొప్పులు పెరిగిపోయి..కొందరిలో తల నొప్పి కూడా వస్తోంది. దీంతో పాటు కంటి చూపు సమస్య మరింత తీవ్రతరమవుతోంది.
కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా లుటిన్, జియాక్సంతిన్ సమ్మేళనాలు అధిక పరిమాణంలో లభించే పలు రకాల ఆహారాలను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. కంటి సమస్యలతో బాధపడేవారు ఆకుపచ్చ కూరగాయలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ ఎ, విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
బచ్చలికూర:
కంటి సమస్యలకు బచ్చలి కూర ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కంటి చూపును పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీరానికి అదనంగా విటమిన్ ఎను కూడా అందిస్తాయి. కాబట్టి తీవ్ర కంటి చూపు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బచ్చలికూర సలాడ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
బ్రోకలీ:
పచ్చి ఆకు కూరలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇందులో బ్రోకలీలో లుటిన్, జియాక్సంతిన్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి కంటి రెటీనా ఆక్సీకరణకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా బ్రోకలీని ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు ఎక్కువగా వినియోగించేవారు తీసుకుంటే కంటి సమస్యల రావని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook