Indoor Plants: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. ఇక అంతే సంగతులు..
Vastu Tips:ఇంటి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందని.. పొల్యూషన్ తగ్గుతుంది అని చాలామంది ప్రస్తుతం ఔట్‌డోర్ గార్డెన్స్ తో పాటు ఇంట్లో కూడా చెట్లు పెంచడానికి ఇష్టపడుతున్నారు. కానీ కొన్ని రకాల చెట్లు అస్సలు ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు వాస్తు శాస్త్రజ్ఞులు. మరి అవేమిటో చూద్దామా..
Vastu Remedies:ఇండోర్ ప్లాంట్స్ ను ఎక్కువగా పెంచడం బాగా ట్రెండింగ్ గా ఉంది. ఇంట్లో ఫ్రెష్ గా ఉంటుందని.. నాచురల్ ఫీల్ వస్తుందని..ఇంటి లుక్ బాగుంటుందని ..ఇలా కారణాలు ఏవైనా కానీ ప్రస్తుతం చాలామంది ఇంట్లో మొక్కలను పెంచడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. దీనితో పాటుగా టెర్రస్ గార్డెన్ ,కిచెన్ గార్డెన్ ,రూఫ్ టాప్ గార్డెన్ అని పలు రకాల మొక్కలను తెచ్చి పెంచడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొని రకాల మొక్కలను పెంచడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. మరి ఆ మొక్కలు ఏంటో తెలుసుకుందామా..
మనలో వాస్తు శాస్త్రం పై నమ్మకం లేని వారు చాలా తక్కువ మందే ఉన్నారు. ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరు తమ ఇంట్లో వాస్తును పాటిస్తారు. ఇల్లు కట్టడం దగ్గర నుంచి ఇంట్లోని వస్తువుల వరకు.. వాస్తు ప్రకారం అవి ఉండవలసిన రీతిలో ఉండకపోతే వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కోవాలి అని ఎందరో భయపడతారు. మరి ముఖ్యంగా మనవాళ్లు ఉన్న వాస్తు శాస్త్రం చాలదు అని ఫెంగ్ షుయ్ అదే చైనీస్ వాళ్ళ వాస్తు ని కూడా ఫాలో అవుతారు. మరి వాస్తు ప్రకారం ఇంట్లో ఎటువంటి మొక్కలు పెట్టుకోకూడదు మీకు తెలుసా?
ముళ్ల మొక్కలు
చాలామంది ఇంటి వెనుక భాగం లేక ముందర పక్క ఫెన్సింగ్ లాగా పనికి వస్తాయి అనే ఉద్దేశంతో ముళ్ళ మొక్కలను ఎక్కువగా నాటుతారు. అయితే ఇలాంటి మొక్కలు నాటడం వల్ల శత్రుభయం పెరగడంతో పాటు ఇంట్లో ధనం తగ్గుతుందట. అందంగా ఉన్న రోజా అయినా సరే ముళ్ళు ఉంటుంది కాబట్టి ఇంటి వాకిట్లో పొరపాటున కూడా నాటకండి అంటారు వాస్తు శాస్త్రజ్ఞులు.
రావిచెట్టు
ఏ గుడికి వెళ్ళినా తప్పక కనిపించే చెట్టు రావి చెట్టు. మన దగ్గర పూజలు అందుకునే ఈ చెట్టు ఇంటిలో మాత్రం ఉండకూడదు అంటారు జ్యోతిష్యులు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి తూర్పు దిక్కున రావి చెట్టు నాటడం వల్ల జీవితంలో అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీలైనంత వరకు ఇంట్లో రావి చెట్టు ఉండకపోవడమే మంచిది.
బోన్సాయ్ మొక్కలు
చాలామంది ఫ్యాషన్ అని చెప్పి మరుగుజ్జు చెట్లు అదేనండి బోన్సాయ్ మొక్కలను ఇంట్లో పెంచుతారు. అయితే ఇలా బోన్సాయ్ మొక్కలు ఇంట్లో పెట్టుకుంటే వాటి ఎదుగుదల ఎలా నిరోధించబడిందో.. అలాగే మన ఎదుగుదల కూడా ఆగిపోతుందట. అందుకే పొరపాటున కూడా ఇంట్లో బోన్సాయి చెట్లు పెట్టుకోకూడదు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించబడినది. ఏదైనా పాటించే ముందు ఒకసారి మీరు మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?
Also Read: Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి