Iron Rich Drink: మంచి జీవితం సాఫిగా సాగాలనుకుంటే తప్పకుండా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం మంచి జీవితాన్ని గడపగలుగుతారు. అయితే ప్రస్తుతం చాలా మంది పోషకాల లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ లోపంతో బాధపడితే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా హిమోగ్లోబిన్ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఐరన్‌ లోపాన్నినియంత్రించడానికి ఈ డ్రింక్స్‌ను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బచ్చలికూర షేక్:
బచ్చలికూర షేక్ బచ్చలికూరలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది మన శరీరంలో ఐరన్‌ లోపాన్ని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఐరన్‌ లోపం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ బచ్చలి కూరతో పాటు  కొబ్బరి, జీడిపప్పు, పైనాపిల్‌ను ఆహారంలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది.


బఠానీ ప్రోటీన్ షేక్:
ఈ షేక్‌లో శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు ఐరన్‌ లోపాన్ని తగ్గించి.. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలను కూడా నియంత్రించి అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.


బీట్‌రూట్ రసం:
బీట్‌రూట్ శరీరంలో రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలో ఐరన్‌ లోపాన్ని తగ్గించి.. శరీరాన్ని తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సీజనల్‌ వ్యాధుల కూడా సులభంగా దూరమవుతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్  


Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి