Kitchen Cleaning Tips: మీరు కూడా జామ్ అయిన కిచెన్ సింక్ వల్ల ఇబ్బంది పడుతుంటే ఈ రోజు మేము మీకు కొన్ని ప్రత్యేక చిట్కాలను చెబుతాం. వీటిని అనుసరించి మీరు జామ్ అయిన కిచెన్ సింక్‌ను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిచెన్ సింక్‌లో ఖాళీ వాడేసిన పాత్రలను ఉంచడం వల్ల తరచుగా సింక్లో ఆహారపదార్థాలు పడి జామ్ అవుతుంది. ఈ కారణంగా అది క్రమంగా మూసుకుపోతుంది. తరచుగా వంటగదిని శుభ్రం చేస్తారు, కానీ కిచెన్ సింక్‌ను శుభ్రం చేయలేరు. కిచెన్ సింక్ జామ్ అయిన తర్వాత ప్లంబర్‌ని పిలవాలి. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఈ రోజు మేము మీకు కొన్ని ప్రత్యేక చిట్కాలను చెబుతున్నాం. వీటిని అనుసరించి మీరు కిచెన్ సింక్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు.


కాఫీతో శుభ్రం చేయండి..
కిచెన్ సింక్‌ జామ్ అయితే దాన్ని శుభ్రం చేయడానికి కాఫీ ఉత్తమ ఎంపిక. దీని కోసం కాఫీ పొడితోపాటు లిక్విడ్ డిటర్జెంట్, వేడినీరు అవసరం. కిచెన్ సింక్ నుండి నీరు బయటకు రాకపోతే ముందుగా అందులో కాఫీ పౌడర్ ,లిక్విడ్ సోప్ వేయండి. దీని తరువాత అందులో వేడినీరు పోయండి. ఇలా చేయడం వల్ల సింక్‌లో పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది. దీంతో పాటు సింక్ నుంచి వచ్చే వాసన కూడా పోతుంది.


Also read: Skin care: ముఖంపై నల్లమచ్చలు తగ్గడానికి బెస్ట్ హోం రెమిడీ.. స్కిన్ గ్లో విపరీతంగా పెరుగుతుంది..


వెనిగర్‌తో సింక్ జామ్ తొలగించవచ్చు..


కిచెన్ సింక్ నుండి మురికిని తొలగించడానికి వెనిగర్ ,బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. మొదటగా కిచెన్ సింక్‌లో బేకింగ్ సోడా వేసి, అందులో వెనిగర్ వేయాలి. ఇలా చేయడం వల్ల సింక్‌లో అంటుకున్న మురికి సులభంగా తొలగిపోతుంది. మీకు వెనిగర్ లేకపోతే, బదులుగా నిమ్మరసం కూడా ఉపయోగించవచ్చు.


ఈ జాగ్రత్తలు తీసుకోండి..
మీరు ఒక వారం లేదా 10 రోజుల్లో కిచెన్ సింక్‌ను శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల సింక్ ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. అయితే, సింక్ మూసుకుపోకుండా ఉండటానికి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఖాళీ పాత్రలను సింక్‌లో ఉంచినట్లయితే, మిగిలిపోయిన ఆహారాన్ని పారేయడానికి ప్రయత్నించండి. దీనితో పాటు సింక్ డ్రెయిన్‌పై మెష్ కవర్‌ను ఉంచండి. తద్వారా చెత్త డ్రైనేజీ పైపు లోపలికి వెళ్లదు


Also read: Breakfast Ideas: ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను ఉదయాన్నే త్వరగా సిద్ధం చేసుకోవచ్చు.. తప్పకుండా ప్రయత్నించండి..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter