Jaggery Benefits: బెల్లాన్ని ప్రతిరోజు తింటే శరీరానికి ఎన్ని లాభాలు కలుగుతాయి తెలుసా?
Jaggery Benefits: ప్రతిరోజు బెల్లాన్ని తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
Jaggery Benefits: పూర్వీకులు రాత్రి భోజనం చేసిన తర్వాత బెల్లంతో తయారుచేసిన ఆహార పదార్థాలను తీసుకునేవారు. నిజానికి ఇలా బెల్లంతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. బెల్లంలో ప్రోటీన్, విటమిన్ బి12, బి6, ఫోలేట్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ తో పాటు సెలీనియం వంటి అనేక రకాల ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి బెల్లంతో తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గడమే కాకుండా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది దీంతోపాటు శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. బెల్లం వల్ల శరీరాన్ని కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం తినడం వల్ల కలిగే లాభాలు:
బరువు తగ్గడం:
బెల్లంలోని అధిక మోతాదులో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి దీనితో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల సులభంగా శరీర బరువు నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా శరీరంలోని పేరుకుపోయిన మలినాలను బయటకు పంపించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో ఉండే పొటాషియం ఎలక్ట్రోలైట్‌లను బ్యాలెన్స్ చేసేందుకు సహాయపడతాయి. కాబట్టి సులభంగా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి.
పీరియడ్ నొప్పి :
మహిళల్లో పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, తిమ్మిర్లను తగ్గించేందుకు కూడా బెల్లం ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ లక్షణాలను సులభంగా నివారిస్తాయి. కాబట్టి మహిళలు తప్పకుండా బెల్లాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రోగనిరోధక శక్తి:
బెల్లంలో ఉండే జింక్, సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ కారణంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయి. దీని కారణంగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
మలబద్ధకం:
బెల్లంలో ఉండే ఆయుర్వేద గుణాలు మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ప్రభావంతంగా సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచి అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా మూత్ర విసర్జన వ్యవస్థను సులభతరం చేసేందుకు కూడా దోహదపడతాయి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter