Jaggery Coconut Laddu Recipe:  బెల్లం, కొబ్బరి కలిపి లడ్డు తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం ఎంతో ధృడంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బెల్లం లో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. కొబ్బరి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పిల్లలు రోజు కొబ్బరి బెల్లం లడ్డు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మంచిది. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో యాలకులను కూడా కలిపి తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఎముకలు ధృడంగా తయారు అవుతాయి. పిల్లలతో పాటు ఎముకల నొప్పి, కీళ్ల నొప్పి సమస్యలు కూడా తగ్గుతాయి.అంతేకాకుండా దీనిని తయారు చేసుకోవడం ఎంతో సులభం, అలాగే మనం పిల్లలతో పాటు వీటిని తీసుకోవడం చాలా మంచిది. దీని  ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెల్లం కొబ్బ‌రి ల‌డ్డూలకి కావాల్సిన ప‌దార్థాలు:


కొబ్బరి తురుము  ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, యాలకుల పొడి  టీస్పూన్‌.


బెల్లం కొబ్బ‌రి ల‌డ్డూల‌ను త‌యారు చేసే విధానం:


బెల్లం గడ్డను ముక్కలుగా చేయాలి. మరుగుతున్న నీటిలో బెల్లంపొడి వేసి కరిగించాలి. . బెల్లం మొత్తం కరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్ట‌వ్‌ మీద పాన్‌ పెట్టి తురిమిన కొబ్బరి వేయాలి. ఇందులో బెల్లం పాకం కూడా వేసి కల‌పాలి.  మిశ్రమం దగ్గర పడిన తర్వాత దించే ముందు యాలకుల పొడి వేసి కల‌పాలి. మిశ్రమం చల్లారిన తర్వాత ల‌డ్డూలుగా గుండ్రటి షేప్‌లో వ‌త్తుకోవాలి. దీంతో బెల్లం కొబ్బ‌రి ల‌డ్డూలు త‌యార‌వుతాయి. 


ఈ విధంగా లడ్డులను తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.  ఎముకలు ధృడంగా తయారు అవుతాయి.  పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా లడ్డులను తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.  ఎముకలు ధృడంగా తయారు అవుతాయి.  పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారు. బ్రేక్‌ ఫాస్ట్‌లో ఈ లడ్డును తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.


Also read: Interview Tips: ఇంటర్వ్యూలో ఏయే పొరపాట్లు చేయకూడదు, ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook