Jock Itch Home Remedies: ప్రస్తుతం చాలామందిని పట్టిపీడిస్తున్న వ్యాధుల్లో దురద ఒకటి. బాహ్య శరీరంపై దురద వస్తే ఎలాగోలా రుద్దుకోవడానికి సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుతం చాలామందిలో గ‌జ్జ‌లు, పిరుదుల మధ్య దురద సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చెప్పుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమస్య నలుగురిలో ఉన్నప్పుడు వస్తే ఆపుకోవడం చాలా కష్టం. కానీ రుద్దుకోవడం అంతకంటే కష్టం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు గాని, ఇతరుల మధ్య గాని గ‌జ్జ‌ల్లో దురద సమస్య వచ్చినప్పుడు ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.  అయితే చాలామందిలో ఈ ఇలాంటి దురద సమస్యలు ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తున్నాయని చర్మం వైద్య నిపుణులు చెబుతున్నారు. లావు చర్మం ఉన్న వారిలో ఇలాంటి సమస్యలు రావడం చాలా అరుదైనప్పటికీ.. బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల సులభంగా వస్తున్నాయని వారంటున్నారు. 


ఇప్పటికే గ‌జ్జ‌ల్లో దురద సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బిగుతుగా ఉండే బట్టలను ధరించకపోవడం చాలా మంచిదని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలామందిలో టైట్ గా ఉండే బట్టలను ధరించడం వల్ల చెమట అక్కడే పేరుకుపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్లు మరింత పెరుగుతున్నాయని దీని కారణంగానే దురద సమస్య తీవ్రతరమవుతుందట. తరచుగా ఈ దురద సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన వేపాకు మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది. వేపాకు లో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. 


Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు



చంక‌లు, పిరుదుల మ‌ధ్య‌లో దురద సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు పడుకునే క్రమంలో కాటన్ వస్త్రాలను ధరించడం చాలా మంచిది. అంతేకాకుండా ఆయుర్వేద షాపుల్లో లభించే వేపతో తయారుచేసిన నూనె కూడా వినియోగించవచ్చు. దురద ప్రభావిత ప్రాంతంలో రోజు పడుకునే ముందు వేప నూనెను అప్లై చేసి ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తేనెను రాసుకోవడం వల్ల కూడా ఈ సమస్య సులభంగా దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే ఔషధ గుణాలు సులభంగా దురదను తగ్గించి అన్ని రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయి.


Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి