Joint Pain Relief In 10 Days: శరీరంలో అధిక పరిమాణంలో యూరిక్ యాసిడ్ పెరగడం కారణంగా తీవ్ర కీళ్ల నొప్పుల సమస్యల బారిన పడుతున్నారు. కీళ్ల నొప్పులే కాకుండా చాలామందిలో వెన్ను, నడుము నొప్పులు సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. ప్రస్తుతం చాలామందిలో యూరికి యాసిడ్ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఊబకాయం సమస్యనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాబట్టి ఈ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచనల మేరకు శరీర బరువును నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలను కూడా విచ్చలవిడిగా తింటున్నారు. కాబట్టి ఇలాంటి ఆహారాలకు బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు పండ్లను డైట్ లో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ నియమాలను పాటించడం వల్ల కూడా సులభంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. 


Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత


ప్రతిరోజు వ్యాయామాలు చేయడం వల్ల కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణాలు నియంత్రణలో ఉండి..కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయని ఆరోగ్యంగా చెబుతున్నారు. కాబట్టి తీవ్ర కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ప్రతిరోజు స్విమ్మింగ్ తో పాటు యోగ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కండరాలు దృఢంగా మారి.. శరీరంలో కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.


తీవ్ర కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు.. తప్పకుండా వైద్యులు సూచించిన ఔషధాలను వినియోగించాల్సి ఉంటుంది. సరైన సమయాల్లో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ ప్రతిరోజు ఈ ఔషధాలను వినియోగించడం వల్ల నొప్పులు దూరమవుతాయి. అంతేకాకుండా ఔషధాల వల్ల శరీర బరువు పెరిగితే తప్పకుండా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కోసం వైద్యులు సూచించిన డైట్ తో పాటు వ్యాయామాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు ఇలా ఒత్తిడికి గురయ్యే వారిలో కీళ్ల నొప్పులు వస్తున్నాయి. కాబట్టి ఎంత సులభంగా ఒత్తిడిని నియంత్రించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook