Jonna Ambali Recipe In Telugu: జొన్న అంబలి తెలంగాణ సాంప్రదాయక వంటకం.. దీనిని పూర్వికులు ఎక్కువగా అల్పాహారంగా తీసుకునేవారు. దీనిని జొన్న పిండితో పాటు ఇతర చిరుధాన్యాలతో కూడా తయారు చేసుకోవచ్చు. ప్రతిరోజు జొన్న అంబలిని తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కలిగించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అందుకే పూర్వీకులు ఎక్కువగా వేసవికాలంలో అల్పాహారంలో భాగంగా జొన్న అంబలిని తాగే వారట. అంతేకాకుండా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ జొన్న అంబలిలో అన్నాన్ని కూడా కలుపుకొని తినేవారట. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన రెసిపీని ప్రతి ఒక్కరు ఉదయం పూట అల్పాహారంలో భాగంగా తీసుకోవాలి. అయితే దీనిని ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావలసిన పదార్థాలు:
❃ 1 కప్పు జొన్న పిండి
❃ 3 కప్పుల నీరు
❃ 2 కప్పుల పెరుగు
❃ 1/2 టీస్పూన్ నల్ల మిరియాలు
❃ 2 పచ్చి మిరపకాయలు (తరిగినవి)
❃ 1/2 టీస్పూన్ జీలకర్ర
❃ ఉప్పు రుచికి సరిపడా


తయారీ విధానం:
❃ దీనిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒక గిన్నెలో జొన్న పిండిని కలిపి, ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
❃ ఆ తర్వాత స్టవ్ వెలిగించి దానిపై కళాయి పెట్టుకొని ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో పోసి మీడియం ఫ్లేమ్ పై ఐదు నిమిషాల పాటు ఉడికించాల్సి ఉంటుంది.
❃ ఇలా ఉడికేటప్పుడు ఈ మిశ్రమం గంజి లాగా మారుతుంది. ఇలా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
❃ ఆ తర్వాత ఇందులో పెరుగు, నల్ల, మిరియాలు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని మరో ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
❃ కావాలనుకుంటే ఇందులో నీటిని కూడా పోసుకోవచ్చు. ఇలా పోసుకొని ఫ్రిజ్లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.


చిట్కాలు:
❃ అంబలి మరింత రుచిగా ఉండడానికి ఇందులో కొత్తిమీర ఆకు లేదా పుదీనా ఆకులను కూడా వినియోగించవచ్చు.
❃ ఈ అంబాలిని వినియోగించే క్రమంలో ఎక్కువగా నీటిని పోసుకోవడం వల్ల రుచి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన మోతాదులో నీటిని పోసుకోవడం చాలా మంచిది.
❃ అలాగే అంబలి మరింత పుల్లగా రావడానికి నిమ్మ రసాన్ని కూడా వినియోగించవచ్చు.
❃ ఈ అంబలిలో కావాలనుకుంటే రాగి పిండిని కలుపుకొని కూడా తయారు చేసుకోవచ్చు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



ఆరోగ్య ప్రయోజనాలు:
❃ ప్రతిరోజు జొన్న అంబలి తాగడం వల్ల జీర్ణ క్రియ మరియు పడుతుంది దీంతో పాటు మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
❃ అలాగే డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడే వారికి జొన్న అంబలి ఎంతో సహాయపడుతుంది.
❃ జొన్న అంబలి ప్రతిరోజు తాగడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు కూడా నియంత్రణంలో ఉంటాయి.
❃ అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది దీని కారణంగా ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
❃ పొట్ట తాగడం వల్ల పొట్ట కూడా ఎంతో చల్లగా ఉంటుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి