Juices For Skin Care: ప్రతి ఒక్కరూ అందమైన చర్మాన్ని పొందడానికి ఎన్నో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను వినియోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా అనేక రకాల చిట్కాలను వినియోగిస్తూ ఉంటారు. కొంతమంది అయితే అందమైన చర్మాన్ని పొందడానికి ఖరీదైన ట్రీట్మెంట్లు కూడా చేయించుకుంటున్నారు. అయితే వీటి ద్వారా కొన్ని రోజులు మంచి చర్మాన్ని పొందినప్పటికీ ఆ తర్వాత ఎప్పటిలాగే చర్మం రంగు మారిపోతుంది. అయితే చర్మాన్ని పైనుంచి రక్షించుకోవడమే కాకుండా శరీరం లోపలి నుంచి కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. చర్మం లోపల నుంచి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ఆహారాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల చర్మాన్ని మెరుగుపరుచుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం వాతావరణ కాలుష్యం కారణంగా చాలామందిలో డ్రై స్కిన్‌తో పాటు అనేక రకాల చర్మ సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ సమస్యలకు ఒకటే పరిష్కారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డ్రై స్కిన్ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు నాలుగు లీటర్ల చొప్పున నీటిని తాగడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దీనివల్ల చర్మం కూడా అందంగా ఆరోగ్యంగా మారుతుంది. చర్మంపై జిడ్డు కూడా తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


అంతేకాకుండా చర్మం ఆరోగ్యంగా ఉండడానికి క్యారెట్ జ్యూస్ కూడా ఎంతగానో సహాయ పడుతుంది. క్యారెట్ లో ఉండే పోషకాలు చర్మంపై గీతలను, పొడిబారడాన్ని సులభంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మంపై రంగును అందించేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ప్రతిరోజు కీరదోసతో తయారుచేసిన రసాన్ని తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


తరచుగా చర్మ సమస్యలతో బాధపడుతున్న వారిని ప్రతిరోజు బీట్ రూట్ రసం తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ రసంలో చర్మానికి కావాల్సిన విటమిన్ సి,  విటమిన్ ఏ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ఈ రసాన్ని తాగడం వల్ల అన్ని రకాల చర్మ సమస్యలు దూరమవుతాయి. దీంతో పాటు సాయంత్రం పూట బత్తాయి రసం తాగడం వల్ల కూడా శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచే అనేక రకాల పోషక గుణాలు లభిస్తాయి. కాబట్టి ఈ రసాన్ని తాగడం వల్ల చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా సమస్యలతో బాధపడుతున్న వారు అతిగా రసాయనాలు కలిగిన సభ్యులను వినియోగించకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter