Juice For Skin: ఈ డ్రింక్‌ను ప్రతిరోజు తీసుకోవడంతో ముఖంపై ఒక మొటిమ కూడా ఉండదు..!
Juice For Spotless Skin: చర్మానికి ఆరోగ్యాన్ని అందించే అనేక రుచికరమైన జ్యూస్‌లు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల సహాజంగా కాంతిని పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Juice For Spotless Skin: చర్మం మన ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన అంశం. వాతావరణ మార్పులు, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, అస్తవ్యస్త జీవనశైలి వంటి అనేక అంశాలు దానిని ప్రభావితం చేస్తాయి. ఈ కారకాలు మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి చర్మ సమస్యలకు దారితీస్తాయి. అయితే కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు, సమస్యలను నివారించవచ్చు. మనం తినే ఆహారం చర్మం సహా మన మొత్తం ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని రకాల ఆహారాలు చర్మానికి అవసరమైన పోషకాలను అందించి, దానిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అందులో కొన్ని మనం ప్రతిరోజూ తినే పండులు, కూరగాయాలు.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌లు, మినరల్స్, పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి కావాల్సిన విటమిన్‌లు అందిస్తాయి. అయితే విటిమన్ సి చర్మ కణాలను దెబ్బతినకుండా, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి సహాయపడుతుంది. అంతేకాకుండా విటమిన్ ఎ చర్మ కణాల పునరుత్తపత్తిని ప్రోత్సహిస్తుంది. విటమిన్ ఇ చర్మాన్ని తేమగా ఉంచడంలో ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ పోషకాలు ఎక్కువగా ఆరెంజ్, బెర్రీలు, ఆకుకూరలు, బ్రోకలీ, క్యారెట్‌లో
లభిస్తాయి.
వీటితో పాటు నట్స్, విత్తనాలు తినడం వల్ల చర్మం కాంతివంతగా తయారు అవుతుంది. ఇందులో ఉండే ఒమేగా-3, విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా దొరుకుతాయి. ఈ నట్స్, విత్తనాలు చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చర్మానికి తేమను అందించడంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. జింక్ చర్మం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అవిసె గింజలు, వాల్‌నట్స్, చియా విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటివి చర్మానికి మంచివి. తగినంత నీరు తాగడం చర్మానికి హైడ్రేటెడ్ గా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి చాలా ముఖ్యం. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి.
వీటితో పాటు ఈ ఆరోగ్యకరమైన డ్రింక్‌ను తీసుకోవడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు రాకుండా సహాయపడుతుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ప్రతిరోజు ఉదయం టీ, కాఫీ బదులుగా దీని తీసుకోవడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. ఈ డ్రింక్స్ కోసం కొన్ని వస్తువులు సరిపోతాయి. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
ఒక యాపిల్
ఒక కీరదోస
ఒక క్యారెట్
ఒక బీట్‌రూట్
ఒక దానిమ్మ
నీరు
తయారీ విధానం:
యాపిల్‌ను ముక్కలుగా కోసి, మధ్యలోని గింజలను తొలగించండి. కీరదోస, క్యారెట్, బీట్‌రూట్‌లను కూడా ముక్కలుగా కోసుకోండి. అన్ని పదార్థాలను ఒక మిక్సీ జార్‌లో వేసి, దానిమ్మ గింజలతో సహా మెత్తగా గ్రైండ్ చేయండి. కావలసినంత నీరు కలిపి మరోసారి గ్రైండ్ చేయండి. జ్యూస్‌ను వడకట్టి తాగండి.రోజుకు ఒకసారి, ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ 21 రోజుల పాటు తాగితే చర్మ సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు.
ఈ జ్యూస్ ప్రయోజనాలు:
యాపిల్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. కీరదోసలో విటమిన్ సి, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది, చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడే నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి మంచి రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ జ్యూస్ చర్మ సమస్యలకు ఒక ఔషధం కాదని గమనించడం ముఖ్యం. అయితే ఇది ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తాగినప్పుడు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే పోషకాలను అందిస్తుంది.
గమనిక:
అలెర్జీలు ఉన్నవారు ఈ జ్యూస్ తాగే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
ఈ జ్యూస్‌లో చక్కెర లేదా ఇతర స్వీటెనర్‌లను కలపవద్దు.
తాజాగా తయారు చేసిన జ్యూస్‌ను మాత్రమే తాగండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి